దర్శకేంద్రుడు పెళ్లి సందడి చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ లీల.. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో తెగ సందడి చేసింది. అయితే వీటిలో అన్ని అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాయి. సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాల చొప్పున వరుస పెట్టి చేస్తున్నప్పటికీ ఈ బ్యూటీ ఆశించిన హిట్టు మాత్రం పడడం లేదు. భగవంత్ కేసరి రూపంలో భారీ సక్సెస్ వచ్చినప్పటికీ.. ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం ఓ రేంజ్ లో ఎత్తేస్తుంది అనుకున్న ఈ బ్యూటీ కి నిరాసే మిగిలింది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా బాగా ఫేమస్ అయినా ఈ పాపకు యూత్‌లో మంచి క్రేజీ ఉంది. మొదటి సినిమా తోటే స్టార్ హీరోయిన్ రేంజ్ రావడంతో.. ఆఫర్లకి కొదవలేదు. ఇక తాజాగా ఆమె పుష్ప 2 మూవీలో ఓ స్పెషల్ సాంగ్ తో కిస్సిక్ బ్యూటీగా ఫేమస్ అయింది. అయితే ప్రస్తుతం తిరిగి మళ్ళీ అలాంటి పాటను చేయను అంటోంది శ్రీ లీల.. ఇలాంటి తప్పు మళ్ళీ చేయను అంటూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొదటి సినిమా నుంచి తన డాన్సులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శ్రీ లీల రవితేజ ధమాకా చిత్రంలో తన డాన్స్ ధమాకా ఏ రేంజ్ లో ఉంటుందో చూపించండి. ఇక మహేష్ బాబు గుంటూరు కారం మూవీ లో ఆమె డాన్స్ కి ఫిదా కాని వారు ఉండరు. స్క్రీన్ పై శ్రీ లీల డాన్స్ అంటే థియేటర్లో ఈలలు వేయని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంత మంచి డాన్సర్ కాబట్టి పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కి అంత పాపులారిటీ వచ్చింది.
అయితే శ్రీ లీల మాత్రం ఇకమీదట స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయిందట. ఒక హీరోయిన్ ఏదైనా స్పెషల్ సాంగ్ చేసినప్పుడు అది హిట్ అయితే ఇకపై అలాంటి అవకాశాలే ఎక్కువగా వస్తాయి.. తక్కువ కాలంలో బాగా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటిది గోల్డెన్ చాన్స్ అనే చెప్పవచ్చు. అయితే హీరోయిన్ గా మాత్రమే ఉండాలి ఐటమ్ గర్ల్ గా ముద్ర పడకూడదు అనుకుంటున్న శ్రీ లీల ప్రస్తుతానికి స్పెషల్ సాంగ్స్ కి దూరంగా ఉండడానికి ఫిక్స్ అయిందట.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ విశ్వంభర మూవీలో ఓ ఐటమ్ సాంగ్ కి శ్రీలీలను అప్రోచ్ కాగా.. సున్నితంగా నో చెప్పింది అట. అంతేకాదు పుష్పాలో పాట కూడా కేవలం అల్లు అర్జున్‌తో డాన్స్ చేయాలి అనే ఒక కోరికతో మాత్రమే చేశానని.. ఐటెం సాంగ్స్ చేయడం తనకు ఇష్టం లేదని శ్రీ లీల స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రాబిన్హుట్ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. కనీసం ఏ మూవీ తో అయినా ఈ బ్యూటీ భారీ సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.