యాంకరింగ్ రంగంలో క్వీన్ గా గత రెండు దశాబ్దాల నుండి కొనసాగుతూ ఇప్పటికీ తనకి తానే సాటి ఎవ్వరూ లేరు పోటీ అనిపించుకున్న యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే అది సుమ అనే చెప్పాలి.
ఇక మన చిన్నతనం నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో చూసిన రాజీవ్ కనకాల ఇప్పటికీ ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు.
వీళ్లిద్దరి కొడుకు ఇండస్ట్రీ లో హీరోగా అడుగుపెడుతున్నాడు అంటే ఆడియన్స్ లో కనీస స్థాయి అంచనాలు ఉంటాయి. కానీ లుక్స్ పరంగా ఎందుకో రోషన్ ఆడియన్స్ కి నచ్చలేదు. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం మంచి మార్కులు అందుకున్నాడు.
ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బబుల్ గమ్’ రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. టాక్ మరియు రివ్యూస్ ని కూడా పాజిటివ్ గానే సంపాదించుకుంది.
అయితే విడుదలై మూడు రోజులు దాటిన ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. మొదటి రోజు ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలకు కలిపి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
అంత పెద్ద సెలెబ్రిటీల కొడుకు అయిన రోషన్ మొదటి సినిమాకి ఇది చాలా తక్కువ వసూళ్లు అనే చెప్పాలి. కానీ నెగటివిటీ ని ఛేదించి ఆ మాత్రం వచ్చిందంటే పర్వాలేదని అంటున్నారు కొంతమంది ట్రేడ్ పండితులు.
ఇక రెండవ రోజు ఈ చిత్రానికి 60 లక్షల రూపాయిల షేర్, మూడవ రోజు 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అలా ఓవరాల్ గా ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగింది. సినిమా విడుదలకు ముందు ప్రొమోషన్స్ తో కూడా కలిపి దాదాపుగా 8 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది.
అంటే బ్రేక్ ఈవెన్ దాటాలంటే 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది ఇప్పుడు దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.
నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఫుల్ రన్ లో అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ గా ఈ చిత్రాన్ని కమర్షియల్ డిసాస్టర్ అని చెప్పొచ్చు.