ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఒకే సామజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం అరుదైన సందర్భంగా చెప్పుకోవచ్చు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడు సీఎం జగన్. అంతే కానీ బయట ఎక్కువగా వీళ్లిద్దరు కలవలేదు.
అయితే ఈ ఇద్దరు ఇప్పుడు దేశం కానీ దేశం లో ఒకే వేదికని పంచుకోబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. వచ్చే నెల 15 నుండి 18 తారీఖున మధ్యలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్విజర్ల్యాండ్ టూర్ చేపట్టనున్నాడు.
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఇది. అక్కడ జరగబోతున్న దావోస్ అంతర్జాతీయ సదస్సు లో పాల్గొనబోతున్నారు రేవంత్. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ కి పెట్టుబడులు తీసుకొని రావడమే ఆయన లక్ష్యం అన్నమాట.
గత ఏడాది ఇదే జనవరి నెలలో సీఎం జగన్ కూడా ఈ అంతర్జాతీయ దావోస్ సభలో పాల్గొన్నాడు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది కూడా అయన దావోస్ సభలకు హాజరు కాబోతున్నాడు.
అలా ఇద్దరు ఒకే వేదికని పంచుకోబోతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియనున్నాయి.
యూత్ లో మంచి ఇమేజ్ ఉన్న ఈ ఇద్దరు సీఎంలు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆరోజు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తెలంగాణ లో త్వరలోనే ఎంపీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే సమయం లో మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు. సీఎం జగన్ రెండవ సారి కూడా ముఖ్యమంత్రి అవుతాడా లేదా, మరో పక్క రేవంత్ రెడ్డి రాబొయ్యే ఎంపీ ఎన్నికలను కూడా క్లీన్ స్వీప్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.