మరో 2,3 నెలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని అనూహ్యమైన మార్పులకు గురి చేయబోతోంది అనడం పెద్ద సమస్య కాబోదు అని చెప్పిలి.
ఓవైపు రెండు సార్లు కేంద్రంలో అధికారం దక్కడంతో ఇక తామకు తిరుగులేదు అని ఫీలయ్యే బీజేపీ పార్టీ, మరోవైపు 10 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండడం..
అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కోల్పోవడంతో, ఈసారి ఎలాగైనా ఢల్లీి పీఠంపై హస్తం గుర్తును ఎగరేయాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉన్నాయి.
దీంతో అటు బీజేపీGదాని మిత్రపక్షాలు, ఇటు కాంగ్రెస్Gదాని మిత్ర పక్షాలు హోరాహోరీగా తలపడటానికి సిద్ధమౌతున్నాయి.
ఇదిలా ఉంటే దక్షిణాదిన బీజేపీ కేవలం కర్నాటకలో మాత్రమే అధికారపీఠం అధిరోహించగలిగింది. మిగిలిన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి)లో దాని ఆశ నెరవేరలేదు.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. ఈ బెల్ట్‌లో కాంగ్రెస్‌కు ఉన్న పట్టు బీజేపీకి లేదన్నది వాస్తవం. ఉత్తరాదిన బీజేపీ పట్టు నిలుపుకుంటుంటే దక్షిణాదిన కాంగ్రెస్ తన తడాఖా చూపించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల కర్ణాటకలో అధికారం దక్కించుకుంది. అదే ఊపుతో తెలంగాణలోనూ పాగా వేసింది. ఇప్పుడు ఏపీపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలోనే తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సోనియాను నిలపాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. దీనికి సోనియా నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిందట.
అయితే ఊహించని విధంగా బీజేపీ కూడా ప్రధాని నరేంద్రమోదీని తెలంగాణలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది.
దీంతో కేంద్ర రాజకీయం తెలంగాణ కేంద్రంగా సాగనుండటం ఆసక్తికరంగా మారింది. ఇలా రెండు జాతీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణ నుంచి పోటీకి దిగితే దక్షిణాదిన ఆయా పార్టీలకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది.
అయితే వీరిద్దరిలోనూ సోనియాగాంధీకి గెలు ఛాన్స్‌లు అధికంగా ఉండడం మనం గమనించాలి. ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అధికారంలో ఉండటం, ఇటు తెలంగాణలో కూడా అధికారంలో ఉండటం.
పక్కనే మరో తెలుగు రాష్ట్రంలో మళ్లీ పార్టీకి జవసత్వాలు వస్తుండడంతో ఆమె గెలుపు ఏపీలో రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా మార్చుతాయని చెప్పవచ్చు.
ఇక నరేంద్రమోదీ విషయానికి వస్తే.. తెలంగాణలో పార్టీకి అంతో ఇంతో కేడర్, ఓటింగ్ ఉన్నప్పటికీ అది అధికారం సాధించే స్థాయిలో లేదన్నది వాస్తవం.
మరోవైపు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అత్యల్పంగా 0.6 ఓటింగ్ ఉండటం వల్ల ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉండదు.
పైగా మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్ ఓట్లు అధికంగా ఉండటం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉండటం ఆయనకు మైనస్‌గా మారే అవకాశం ఉంది.