బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ కి ఆడియన్స్ బ్రహ్మారథం పట్టారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా రాత్రి 9 దాటితే చాలు, పనులన్నీ పూర్తి చేసుకొని టీవీ ముందు కూర్చునేవారు ఆడియన్స్. అలా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ సీజన్ నిన్నటితో ముగిసింది. రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ ని గెలుచుకోగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు.
ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోన్స్ వద్ద అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ , కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా వీళ్ళని అదుపు చేయలేకపోయారు.
సుమ కొడుకుతో పోరాడుతున్న సునీత కొడుకు
ఇక అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అమర్ కార్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి కి దిగారు. ఆ కారులో అమర్ దీప్ తో పాటుగా అతని కుటుంబం కూడా ఉంది. అసభ్య పదజాలంతో కొంతమంది ఆకతాయిలు అమర్ ని తిడుతూ అతని కార్ పై దాడి చెయ్యగా, కార్ బ్యాక్ గ్లాస్ పగిలిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న అమర్ దీప్ ఫ్యాన్స్ వేలాదిగా అర్థరాత్రి అమర్ ఇంటికి వద్దకి వచ్చి కాపలా గా నిలిచారు. కేవలం అమర్ దీప్ కార్ మీద మాత్రమే కాదు. అశ్వినీ, భోలే, ప్రిన్స్ యావర్ మరియు బిగ్ బాస్ బజ్ ఇంటర్వూస్ చేసే గీతూ రాయల్ కార్ల మీద కూడా దాడి చేసారు. అశ్వినీ మరియు గీతూ రాయల్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాడికి పాల్పడిన వారిపై కేసు ని నమోదు చేసారు.
ఇంత దురదృష్టకరమైన సంఘటన ఏ సీజన్ లో కూడా జరగలేదు. హౌస్ లో అమర్ మరియు పల్లవి ప్రశాంత్ మధ్య చాలా హీట్ వాతారవరణం లో గొడవలు చాలానే జరిగాయి. ముఖ్యంగా నామినేషన్స్ సమయం లో ఇద్దరి మధ్య జరిగిన వాదనలు తార స్థాయిలో ఉండేవి.
14 వ వారం లో అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని కోపం తో మెడికల్ రూమ్ కి తోసుకుంటూ వెళ్లిన ఘటన పెద్ద సంచలనం రేపిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సంఘటన కారణంగానే అమర్ దీప్ విన్నర్ అవ్వాల్సిన అమర్ రన్నర్ గా నిలిచాడు అని పలువురి అభిప్రాయం.