యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన రీసెంట్ చిత్రం ‘సలార్’ కి మంచి టాక్ వచ్చింది, వసూళ్ల విషయం లో సరికొత్త మైల్ స్టోన్స్ ని దాటింది. అందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో వంద కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఇది ఇప్పుడు సలార్ చిత్రానికి కత్తి మీద సాము లాగ తయారైంది.
మొదటి మూడు రోజులు టాక్ ప్రభావం తో పాటుగా, కాంబినేషన్ క్రేజ్ కూడా కలిసి రావడం తో కనివిని ఎరుగని రేంజ్ వసూళ్లు వచ్చాయి.
నాల్గవ రోజు , ఐదవ రోజు కూడా సెలవలు కావడం తో కలెక్షన్స్ దంచికొట్టేసింది. కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ కావడం తో సలార్ వసూళ్లు పూర్తిగా పడిపోయాయి.
రెండవ వారం థియేటర్స్ కూడా భారీగా తగ్గించేశారు. ఇంకో నాలుగు రోజులు దాటితే ఈ సినిమా కి టికెట్ రేట్స్ కూడా తగ్గిపోతాయి.
కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వీకెండ్ వసూళ్లు భారీ నుండి అతి భారీగా ఉండాలి. క్రేజీ కాంబినేషన్ కావడం తో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 350 కోట్ల రూపాయలకు జరిగింది.
ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వసూళ్లు దారుణంగా పడిపోయినప్పటికీ, హిందీ మరియు ఓవర్సీస్ వసూళ్లు స్టడీ గా ఉన్నాయి.
కానీ ఒక్క నైజాం ప్రాంతం లో తప్ప ఎక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అయితే ఈ వీకెండ్ సలార్ కి బాగా కలిసొచ్చేలా అనిపిస్తుంది. శనివారం , ఆదివారం ఎలాగో వసూళ్లు బాగుంటాయి, ఇక సోమవారం జనవరి 1 వ వస్తుంది. సెలవు దినం కాబట్టి ఆ రోజు కూడా ఈ చిత్రం దుమ్ము లేపే వసూళ్లను రాబట్టొచ్చు.
అలా సంక్రాంతి వరకు వసూళ్లు స్థిరంగా వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. లేకపోతే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వని సినిమాగా ‘సలార్ ‘ నిలిచిపోతుంది.
ఆ చెత్త రికార్డు ని నెలకొల్పిన వాడిగా ప్రభాస్ నిలిచిపోతాడా?, లేకపోతే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని బయ్యర్స్ ని సేఫ్ చేస్తాడా అనేది రాబొయ్యే రోజుల్లో తెలుస్తుంది .