‘ప్రతిరోజూ పండుగే’ అంటూ గత సంక్రాంతికి సూపర్‌హిట్ కొట్టాడు మారుతి. దర్శకుడిగా మంచి ట్రాక్ ఉన్నా ఎందుకో మారుతికి స్టార్స్ అందుబాటులోకి రావడంలేదు. ఆ మధ్య వెంకీ హోం మినిస్టర్‌గా మంచి ఫన్నీ స్క్రిప్ట్‌తో వెంకీని మెప్పించాడు మారుతి. అయితే ఆ సినిమా కథ తనదే అంటూ ఓ వ్యక్తి రచ్చ చేయడంతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే నిర్మాత ఇబ్బందులను అర్ధం చేసుకునే వెంకీ మరో కథతో రమ్మని మారుతి ఆశను సజీవంగానే ఉంచాడు. ఇక అంతా మరుతీ దశ తిరిగింది అనుకున్నారు. అయితే ‘బాబు బంగారం’ అంటూ వచ్చిన ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
దీంతో స్టార్ హీరోలకు, మారుతికి గ్యాప్ మరింత పెరిగింది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మారుతి తనకు అచ్చి వచ్చిన మిడిల్ రేంజ్ హీరో రూట్‌నే నమ్ముకున్నాడు. ఈ కోవలోనే రవితేజతో మంచి మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేశాడు. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. యు.వి. క్రియేషన్స్`గీతాఆర్ట్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములు. అంతా సెట్ అయింది అనుకుంటున్న తరుణంలో రవితేజ రెమ్యునరేషన్ దగ్గర మెలిక పెట్టాడు. ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేశాడట.
బడ్జెట్ విషయంలో అతి జాగ్రత్తగా ఉండే అల్లు అరవింద్ దీనికి ససేమిరా అన్నారట. కట్ చేస్తే సీన్లోకి గోపీచంద్ ఎంటర్ అయ్యాడు. అయినా మారుతి మనసులో మాత్రం మాస్రాజానే ఉన్నాడు. దీంతో అవసరం అయితే నా రెమ్యునరేషన్లో కొంత తగ్గించి రవికి ఇద్దాం.. ట్రై చేయమంటారా అని మారుతి నిర్మాతలతో అన్నారట. దీనికి అరవింద్ స్పందిస్తూ ‘‘అతని కోసం నువ్వంత త్యాగం చేయడం ఎందుకయ్యా మారుతి’’ అని సున్నితంగా మందలించారట. చేసేది లేక మారుతి కూడా గోపీచంద్‌కే దాదాపు ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.