పిట్టల ప్రియుడికి వందేభారత్‌ పడింది…

0
vande bharat fell to the lover of quails

ప్రారంభం నుంచి వందేభారత్‌ రైళ్లు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రారంభంలో ఈ రైళ్లపై రాళ్లదాడులు జరిగాయి.

ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు మార్గమధ్యలోనే ఇవి మొరాయించడం, వాటిని వేరే రైలు ఇంజన్లు వచ్చి లాక్కెళ్లడం, పశువులను ఢీకొట్టి ముందు భాగం ముక్కలవడం ఇలా అనేక ఆసక్తికర సంఘటనలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాయి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.

అదృష్ఠంలో దురదృష్టం అంటే ఏమిటో మనలో చాలామందికి అనేకసార్లు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లా జనగామకు చెందిన హరిబాబుకు మాత్రం నిన్న అనుభవంలోకి వచ్చిందట.

హరిబాబు సహజంగా పిట్టల ప్రియుడు. హరిబాబు గులేరు (పంగలకర్ర) గురిపెడితే ఎంతటి పిట్ట అయినా ఒక్క దెబ్బకు చచ్చాన్రా దేవుడో అంటూ నేలకూలాల్సిందే.. హరిబాబు నోటికి ఆహారం కావాల్సిందే.

హరిబాబు గురిపై ఆయన దోస్త్‌లకు కూడా మంచి గురి. అందుకే శనివారం దావత్‌ చేసుకుందామని డిసైడ్‌ అయ్యారు. మంచింగ్‌ కోసం హరిబాబు పిట్ట మాంసం అరేంజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు.

పంగలకర్ర తీసుకుని పిట్టల వేటకు వెళ్లిన హరిబాబుకు జనగామ లోని అంబేద్కర్‌నగర్‌ రౖౖెలు పట్టాలకు కూత వేటు దూరంలోని ఓ చెట్టుకొమ్మ మీద మాంచి బలిసిన పిట్ట ఒకటి కనపడిరది.

ఇక మన వేటగాడు ఊరుకుంటాడా?.. గురిపెట్టి కొట్టాడు. ఎప్పుడూ చచ్చాన్రా దేవుడో అంటూ నేలకూలాల్సిన పిట్టకు బదులుగా వందేభారత్‌ కూ…కూ…కూ…కూ… అంటూ కూతలు పెట్టింది.

Kannadas new movie Salaar collections dwindled..break even is difficult!

మనవాడు విసిరిన రాయి కాస్తా వైజాగ్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833)కి తగిలింది. అంతే ఒక్కసారిగా అద్దం బద్దలైంది. అత్యంత అధునాతన సెక్యూరిటీ సిస్టమ్స్‌, సీసీ కెమెరాలు అమర్చబడిన వందేభారత్‌ రైలులోని ఇంజన్‌ రూంలో ఉన్న సిబ్బందికి ఈ విషయం క్షణాల్లో చేరిపోయింది.

అప్రమత్తమైన వారు బోగీలోని వారిని విచారించి, జనగామ రైల్వే పోలీసుకలు సామచారం అందించారు. విచారణ చేపట్టిన అధికారులు జనగామ శివారులోని అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతంలో ఈ రాయి దాడి జరిగిందని గుర్తించారు.

వెంటనే అక్కడికి చేరి విచారించగా హరిబాబు ఈ ఘటనకు కారకుడు అని తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను పిట్టల కోసం కొడితే..

అది కాస్తా వందేభారత్‌ రైలు అద్దానికి తగిలిందని చెప్పి భోరుమన్నాడు. అధికారులకు కూడా ఏమి చేయాలో తోచలేదు. విషయాన్ని పై అధికారులకు చేరవేశారు.

వారు కూడా కొద్దిసేపు తర్జనభర్జన పడి చివరికి హరిబాబును అరెస్ట్‌ చేసి, ఆ గులేరు(పంగల కర్ర)ను సీజ్‌ చేయాలని ఆదేశించారు.