తమళ స్టార్ విజయ్ నటించిన వారసుడు ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కించారు. ఈ మూవీ రివ్యూను ఇక్కడ చూద్దాం.
తమిళ్ తలైవి విజయ్ తెలుగులో కూడా మంచి మార్కెట్ నే క్రియేట్ చేసుకున్నాడు. ‘తుపాకి’ నుంచి ఆయన సినిమాలు టాలీవుడ్ లో కూడా బాగా వసూళ్లను రాబడుతున్నాయి. ఇదే తరహాలో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో ‘వారసుడు’లో విజయ్ నటించారు. తమిళంలో చేసిన ఈ సినిమా తెలుగులో డబ్ చేసి రెండు తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేశారు.
కథ
రాజేంద్రన్ (శరత్ కుమార్) బిగ్ ఇండస్ట్రిలిస్ట్. అతనికి ముగ్గురు కొడుకులు జే రాజేంద్రన్ (శ్రీకాంత్), అజయ్ రాజేంద్రన్ (కిక్ శ్యామ్), విజయ్ రాజేంద్రన్ (విజయ్). తండ్రి చాలా స్ట్రిట్. తన ఆలోచనల మేరకే తన కొడుకులు నడుచుకోవాలని అనుకుంటాడు. అందుకే చిన్న కుమారుడు అంటే రాజేంద్రన్ కు అస్సలు పడదు. ఇందులో ఇద్దరు కుమారులు తండ్రి ముందు నటిస్తుండగా, చిన్న కొడుకు విజయ్ మాత్రం సొంతంగా ఎదగాలని కోరుకుంటాడు. దీని కోసమే తండ్రిని విభేదించి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. తండ్రి అనారోగ్యం భారినపడతాడు.
ఈ నేపథ్యంలో ఇద్దరు పెద్ద కుమారులకు కాకుండా చిన్న కుమారుడు విజయ్ కి తన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేస్తాడు. దీతో రాజేంద్రన్, అజయ్ రాజేంద్రన్ తండ్రికి దూరమవుతారు. తండ్రిని ఆ చైర్ నుంచి దింపేందుకు అన్నలు ప్రత్యర్థులతో కలిసి ఎత్తులు వేస్తారు. రాజేంద్రన్ తనకు నచ్చని చిన్న కుమారుడికే వ్యాపార అధిపతిని ఎందుకు చేస్తాడు. కుటుంబంలో కలతలు, అన్నలను మార్చి తన వద్దకు విజయ్ రాజేంద్రన్ ఎలా తెచ్చుకుంటాడు అన్న కోణంలో సినిమా సాగుతుంది.
కథనం
దర్శకుడు పైడిపల్లి పాత కథనే తీసుకొని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ డ్రామా ఫార్ములా పండంటి కాపురం నుంచి నడుస్తుంది. ఇలాంటి కథకే పైడిపల్లి కార్పొరేట్ హంగులు జోడించాడు. అంతకు మించి కథ ఏమీ కనిపించదు. ఇందులో ట్విస్టులు కూడా ఏమీ లేవు. మూడు ఫైట్లను కూడా ఇరికించేశాడు దర్శకుడు. అన్న కూతురు హ్యూమన్ ట్రాఫికర్ కు చిక్కుకోగా విజయ్ కాపాడే సీన్స్ కామన్ పాయింట్స్ తోనే సినిమా సాగుతుంది. కథ పెద్దగా అకట్టుకోకున్నా విజయ్ నటన గురించి మాత్రం చెప్పుకోవచ్చు. మాస్ హీరోగా ముద్ర వేసుకున్న విజయ్ యాక్షన్ సీన్స్ లో మెప్పించారనే చెప్పాలి. రొటీన్ కథతో సాగిన ఈ మూవీలో మూడు ఫైట్లు, రెండు పాటలు జొప్పించి అయిపోయింది అనిపించాడు పైడిపల్లి.
విజయ్ ఫ్యాన్స్, తమిళ్ ఆడియన్స్ ను మూవీ ఆకట్టుకుంటుందనే చెప్పచ్చు. పాత కథే అయినా స్ర్కీన్ ప్లే బాగుంది. సన్నివేశాలను అందంగా చూపడంలో సినిమటోగ్రాఫర్ కార్తీక్ పళని రాణించాడనే చెప్పాలి. ప్రేక్షకులకు సీన్లను అందంగా చూపించాడు. ఇక క్లైమాక్స్ సాంగ్ మాస్ ఆడియన్స్ కు దగ్గరైంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూవ్స్ బాగున్నాయి. భారీ సెట్టింగులు, హంగులతో సినిమా కార్పొరేట్ స్థాయిలో అలరిస్తుంది. తమిళ్ డబ్ అయినా ఆ తరహా ఫీల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పర్ఫార్మెన్స్
విజయ్ నటన గురించి పరిచయం అవసరం లేదు. తన నటనతో సినిమాకు వన్నె తెచ్చాడు. డాన్స్ లు, ఫైట్స్, కామెడీ సన్నివేశాలలో మెప్పించాడు. రష్మిక మందన పాత్ర సినిమా మొత్తంలో దాదాపు 20 నిమిషాలు కూడా ఉండదు. తక్కువ నిడివే అయినా పాత్రకు తగ్గ న్యాయం చేసింది. హీరో తల్లి పాత్ర పోషించిన జయసుధ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక తండ్రి పాత్రలో శరత్ కుమార్, అన్నల పాత్రల్లో శ్రీకాంత్, కిక్ శ్యామ్ బాగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్ విలనిజం గురించి తెలుసు కాబట్టి ఆయన కూడా మంచిగా పర్ఫార్మెన్ ఇచ్చాడు.
ప్లస్ పాయింట్స్: విజయ్ స్ర్కీన్ ప్రజంటేషన్, ఫొటో గ్రఫీ, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: తెలిసిన కథే, స్లో నేరేషన్, ఫస్ట్ ఆఫ్, సినిమా నిడివి.
చివరి మాట: రొటీన్ సిరియల్ ఫ్యామిలీ డ్రామా ‘వారసుడు’.
రేటింగ్: 2.5/5