డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సమ్బదించిన ఓ వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకి ముప్పు ఉందంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది. పవన్ కళ్యాణ్ కి సంబందించి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో ప్రస్తావన వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
ఇందువలన ప్రతి నిముషం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. అయితే ఆ గ్రూప్ లు ఎంటనేవి ఇప్పుడే చెప్పలేమని తెలిపాయి. తన భద్రత పట్ల పవన్ కల్యాణ్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసాయి. కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. పవన్ కల్యాణ్ జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్లు వస్తున్నాయి.
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడంలో ఏపీలో కూటమి విజయం కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి మద్దతుదారు అవ్వడంతో పవన్ టార్గెట్ అయ్యాడని భావిస్తున్నారు. మావోయిస్టులు పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకున్నారని అక్కడక్కడా వార్తలు వినిపిస్తున్నాయి.