అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు… అనే సామెత మనందరికీ తెలిసిందే.. ఈ సామెత రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది. కానీ కండీషన్స్ అప్లై అన్నమాట. ఆ కండీషన్ ఏంటంటే.. తాము అధికారంలో లేకపోతే అందకపోతే కాళ్లు అనేది వర్తిస్తుంది.
కొందరు నాయకుల వ్యవహారం అధికారంలో ఉంటే మాత్రం అందినా జుట్టే.. అందకున్నా జుట్టే అన్నట్టు ఉంటుంది. ఇలాంటి వారిలో జగన్, కేసీఆర్‌లాంటి వారిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విషయంలోకి వెళ్తే.. 2024లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలాంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించటానికి ఇటు అధికారపక్షం వైసీపీ, అటు ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనలు ఎవరి ఎత్తుల్లో వారు నిమగ్నమైపోయారు.
ఎలాగైనా తన పదవిని నిలుపుకోవాలని జగన్ పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు ఎమ్మెల్యేలకు టికెట్‌లు నిరాకరించడం, మరికొందరికి స్థాన చలనం కలిగించడం, ఇంకొదరిని బుజ్జగించడం వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి బాధితుల్లో దాదాపు 50కి పైగా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారట.
జగన్ నిర్ణయం మెజార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల్లో అసంతృప్తికి కారణం అవుతోంది. ఇలా తన సీట్‌ను కోల్పోతున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ జిల్లాకే చెందిన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖమైన ఫ్యామిలీకి చెందిన ఎమ్మెల్యే, ముక్కుసూటిగా వ్యవహరించే నాయకుడికి తన గోడు వెళ్లబోసుకున్నాడట.
వర్మ వ్యూహానికి కోర్టు బ్రేక్
ఆయన జగన్‌తోనే తేల్చుకుందాం పదా అని తాడేపల్లికి తీసుకొచ్చారు. బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నందున ఎమ్మెల్యేలకు ప్యాలెస్‌లోకి ఒకింత ఫ్రీగానే ఎంట్రీ దొరికింది. జగన్ నాయకులతో మాట్లాడుతున్న గదిలోకి ఈ సీనియర్ దూసుకు వెళ్లారు. ఆయన్ను చూసిన జగన్ షాక్ తిన్నారట. ఈయన లోపలకు వచ్చాడేంట్రా అని.
తను వెంట పెట్టుకు వచ్చిన టిక్కెట్ ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన. దానికి జగన్ ‘‘ఇతనికి మంచి మార్కులు రాలేదు. పైగా తీరు మార్చుకోమని ఇంతకు ముందు చెప్పాము’’ అన్నారట.
దానికి ఈయన ‘‘మారాల్సింది వాళ్ల తీరు కాదు. పార్టీ తీరు.. ప్రభుత్వం తీరు. నువ్వేమో బటన్ నొక్కుడు అంటూ ఎమ్మెల్యేలను, కిందిస్థాయి నాయకులను డమ్మీలను చేసినావు.. మరి వీళ్లకి మార్కులు ఎలా వస్తాయి. ముందు నీకు ఫీడ్ బ్యాక్ ఇస్తున్న వారిని మార్చు.. ఎమ్మెల్యేల నియోజవర్గాలను కాదు’’ అంటూ ఘాటుగా అనేసి వచ్చేశాడట.
వెంటనే జగన్ గదిబైట ఉన్న నాయకుణ్ణి పిలిచి ఆయన్నెందుకు లోపలకు పంపారు అని అసహనం వ్యక్తం చేశారట.