ఎవ్వరూ ఊహించని విధంగా దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వై ఎస్ షర్మిల తెలంగాణ లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అనే రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం, కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించకుండా, షర్మిల కి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని రావాలని , మీ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చెయ్యమని చెప్పడం, ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది.
చివరికి షర్మిల విలీనం కి ఒప్పుకున్నట్టు, ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి ప్రాతినిధ్యం వహించడానికి ఒప్పుకున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఆమె ఈ విషయం పై నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెడితే తీవ్రంగా నష్టపోయేది వైసీపీ పార్టీనే. అందుకే జగన్ షర్మిల తో రాయభారం చేసేందుకు వైసీపీ నుండి ఒక సీనియర్ నాయకుడిని పంపినట్టుగా లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
షర్మిల ని వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా, ఆమెకి కడప నుండి ఎంపీ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ సీనియర్ నాయకుడికి సీఎం జగన్ చెప్పి పంపినట్టు సమాచారం.
కానీ షర్మిల అందుకు ఒప్పుకుంటుందా?,అసలు అన్నయ్య జగన్ పేరు ఎత్తితే చిర్రుబుర్రులు ఆడిస్తున్న షర్మిల ఇప్పుడు మాత్రం ఎందుకు ఒప్పుకుంటుంది ?, ఆమె టార్గెట్ ముఖ్యమంత్రి అవ్వడం, ఎమ్యెల్యే లేదా ఎంపీ అవ్వదాం అని కాదు.
ఇప్పటికే షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెడితే ఆమెకి మద్దతుగా వైసీపీ నుండి 50 మంది సిట్టింగ్ ఎమ్యెల్యే లు బయటకి వచ్చేస్తారని కూడా ఒక టాక్ ఉంది.
అసలే టీడీపీ – జనసేన పొత్తు దెబ్బకి తలమునకలు అయ్యున్న జగన్ కి, ఇప్పుడు షర్మిల రూపం లో మరో తలనొప్పి మొదలైంది.
ఆమె కనుక దూకుడుతో రాజకీయాలు చేస్తే, జగన్ మీద ఉన్న వ్యతిరేకతకు వైసీపీ మొత్తం జీరో అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి జగన్ ఆమెతో సంధి చేస్కుంటాడా,లేదా పోరాడుతాడా అనేది వేచి చూడాలి.