తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ అనే పేరు ఎలానైతే చెరగని ముద్రలా ఉందొ.. అలానే వైఎస్ఆర్ అనే పేరు చెరగని ముద్ర అని చెప్పవచ్చు. పాలించింది కేవలం ఐదేళ్లే అయినా..
ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాలతో అనేక మంది పేద ప్రజలకి మంచి జరిగింది. ఇది ప్రతిపక్షం వాళ్ళు కాదనలేని నిజం.
వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన కుమారుడు ఏకంగా వైఎస్ఆర్ పేరుతోనే పార్టీ నెలకొల్పారంటే అర్ధం చేసుకోవచ్చు. కేవలం పార్టీ పేరు పెట్టడం తరువాత దాదాపు 10 ఏళ్ళ తరువాత అధికారంలోకి తీసుకురాగలిగాడంటే..
వైఎస్ఆర్ పేరు ప్రజల్లో ఎంతలా నాటుకుపోయిందో చెప్పవచ్చు. అయితే అలాంటి వైఎస్ఆర్ పేరుకి ఇప్పుడు మచ్చ వచ్చేలా కనిపిస్తుంది.
అందుకు ముఖ్య కారణం వైఎస్ఆర్ కొడుకు, కూతురు అని చెప్పవచ్చు. ఎందుకంటే అన్నతో విభేదించిన చెల్లి.. తాజాగా కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
ఓ పక్క తన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో.. పార్టీని అధికారంలోకి తీసుకొని సుభిక్షంగా పాలన చేస్తున్నాడు. అయితే చెల్లి మాత్రం అన్న ఎదో ఇవ్వలేదని చెప్పి.. విభేదించి కాంగ్రెస్ లో కలవడం శోచనీయం అని అందరూ భావిస్తున్నారు.
ఓ పక్కన తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి.. దానిని ఎవరూ దేకడం లేదని పోటీ నుండి విరమించుకుంది. తండ్రి పేరు చెప్పుకొని తిరిగి నాలుగు ఓట్లు రాల్చుకుందామని అనుకున్నా.. అది నిరాశే అయింది. ఇక గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఏది ఏమైనా ఇప్పుడు ఆంధ్రాలో కూడా అన్నకి పోటీగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే అన్నకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించాల్సి ఉంటుంది.
ఇలా అన్నా చెల్లెల్లు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ప్రజల్లో చులకన అవ్వడం ఖాయం. ఇదే నిజంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో పేరు ప్రతిష్టలు ఉన్న వైఎస్ఆర్ కుటుంబం పరువు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
ప్రజల్లో పేరు ప్రతిష్టలు కలిగిన వైఎస్ఆర్ కి మాయని మచ్చ తెచ్చేలా ఉన్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.