తెలంగాణ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవటానికి బీఆర్‌ఎస్ పార్టీ ఆశలు పెట్టుకున్న పథకం రైతుబంధు.. అలాగే అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న ముఖ్య పథకం కూడా ఇదే.
ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరానికి 10 వేల రూపాయలు (సీజన్‌కు 5 వేలు చొప్పున రెండు సీజన్‌లకు 10) ఇచ్చేది. దీన్ని 15వేలకు పెంచి ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు తెలంగాణ రైతులకు హామీ ఇచ్చింది.
కేటీఆర్ ఇంకా ఆ భ్రమల్లోంచి బయటకు రావట్లేదు..
దీంతో రైతులు ఎవరివైపు మొగ్గు చూపుతారా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడిరది. దీంతో హైదరాబాద్‌ను మినహాయిస్తే వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన తెలంగాణలో రైతులే డిసైడిరగ్ ఫ్యాక్టర్‌గా మారారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన విధానంపై అసంతృప్తిగా ఉన్న రైతులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు.
తాము అధికారంలోకి రాగానే 6 హామీలపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం (కాంగ్రెస్) ఇప్పటికే రెండు పథకాలను అమలులోకి తెచ్చింది. తాజాగా రైతుబంధుపై దృష్టి పెట్టింది. ఈ పథకంలో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన విధానంలో లోపాలను సవరిస్తూ నిర్ణయం తీసుకోనుంది.
గత ప్రభుత్వంలో భూమి ఉంటే చాలు. వ్యవసాయం చేసిన వారికి, చేయని వారికి, ఫామ్‌హౌస్ ఓనర్లకు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా సొమ్ములు ఇచ్చేశారు. తాజాగా ప్రభుత్వం కేవలం వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే రైతుబంధు (పంట సాయం) అందించాలని యోచిస్తోంది.
అలాగే రెండో నిర్ణయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే ఈ సొమ్మును ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ భూములు ఉండి వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉన్న వారికి కూడా ఈ పథకం కింద వందల కోట్ల రూపాయలు చెల్లించారు.
తాజాగా కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు, ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడం ఖాయంగా కనిపిస్తోంది.