2020 సంవత్సరం కరోనాతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంది మూవీ ఇండస్ర్టీ. థియేటర్ల మూసివేత, షూటింగ్ లు నిలిపవేయడంతో ఇండస్ర్టీ కోట్లాది రూపాయలు నష్టపోయింది. చిన్న తరహా ఆర్టిస్టులకు పని లేక ఎంతో ఇబ్బంది పడ్డారు. తర్వాత పెద్ద పెద్ద సినిమాలను సైతం ఓటీటీకి తక్కువ రేటుకే అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రొడక్షన్ హౌజ్ లు చాలా నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
కరోనా నుంచి కొంచెం కోలుకున్న సమయంలోనే (2021)లో ఇండస్ర్టీ మెల్లగా గాడిన పడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే వచ్చింది ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్ లో మంచి వసూళ్లను సాధించింది. ఈ వూపు అన్ని భాషల చిత్రాలను తట్టి లేపింది. 2022 ప్రధమార్థం నుంచి ఇండస్ర్టీ వేగం పుంజుకుంది. సంక్రాంతికి రవితేజ క్రాక్ తో ప్రారంభమైన విజయాల పరంపక ఏడాది చవరి వరకూ నిలిచింది. అందులో ఆర్ఆర్ఆర్, కార్తికేయ-2, సీతారామం, బింబిసార ఇలా ఎన్నో విజయవంతమైన మూవీస్ ఉన్నాయి. వీటితో టాలీవుడ్ కు కలెక్షన్ల వర్షమే కురిసింది. 2022కు సంబంధించి టాప్ 10 హిట్ మూవీస్ ను ఇక్కడ చూద్దాం
1. ఆర్ఆర్ఆర్
జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాం చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. నిర్మాతలకు దాదాపు రూ. 150 కోట్లకు సైగా లాభాలను తెచ్చిపెట్టింది.
2. కేజీఎఫ్-2
కన్నడ భాషలో రూ. 100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజైంది. దాదాపు రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇందులో రూ. 150 కోట్ల వరకూ లాభాలు సాధించి త్రిపుల్ ఆర్ కు సమానంగా నిలిచింది.
3. కార్తికేయ 2
నిఖిల్ హీరోగా చేసిన ‘కార్తికేయ 2’ కూడా బాక్సాఫీస్ హిట్ సాధించింది. సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాత రిలీజ్ కోసం వాయిదాలు పడుతూ వచ్చింది. చివరికి రిలీజ్ అయి పాన్ ఇండియా లెవల్ లో ఆకట్టుకుంది. నిర్మాతలకు రూ. 45.5 కోట్ల వరకూ లాభాలు తెచ్చిపెట్టింది.
4. సీతా రామం
దుల్కర్ సల్మాన్ హీరోగా తీసిన చిత్రం ‘సితారామం’. దీనికి అశ్వినీదత్ కుమార్తెలు నిర్మాతలుగా వ్వవహరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ. 29 కోట్ల వరకూ లాభాలను తెచ్చిపెట్టింది.
5. కాంతారా
భూత కోళను ప్రధానాంశంగా తెరకెక్కిన సినిమా ‘కాంతారా’. ఈ సినిమాను రిషబ్ షెట్టి డైరెక్టర్ చేస్తూ నిర్మించాడు. ఇందులో హీరో కూడా ఆయనే. శాండల్ వుడ్ (కన్నడ చిత్ర పరిశ్రమ)లో రూ. 15 కోట్లతో తీసిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ బ్యానర్ పై రిలీజ్ చేశాడు. దాదాపు రూ. 25 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇంత చిన్న మూవీకి ఇంత పెద్ద లాభాలు రావడం విశేషం.
6. బింబిసార
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన చిత్రం ‘బింబిసార’. చారిత్రక కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. ఈ మూవీ వల్ల నిర్మాతలకు దాదాపు రూ. 22 కోట్లు లాభాలు వచ్చాయి.
7. మేజర్
డిఫరెంట్ కథలను ఎంచుకుని విలక్షణ నటనను ప్రదర్శించే నటుడు ‘అడవి శేషు’. ఆయన హీరోగా వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై పేలుళ్ల ఘగటనలో మరణించిన ఒక పోలీస్ ఆఫీసర్ వీరోచిత గాధను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం తెరకెక్కించారు. బాక్సాఫీస్ హిట్ సాధించిన ఈ ఈ చిత్రంతో రూ. 14 కోట్ల వరకూ లాభాలు చేకూరాయి.
8. విక్రమ్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన మూవీ ‘విక్రమ్’. ఇది ఒక స్పైథ్రిల్లర్. ఇది తమిళ్ మూవీ కాగా తెలుగులోకి డబ్ చేశారు. ఇది రెండు చోట్ల భారీ విజయాన్ని సంపాదించుకుంది. దీనికి నిర్మాతగా కమల్ హాసనే వ్యవహరించారు. ఇది రూ. 10 కోట్ల వరకూ లాభాలను తీసుకచ్చింది.
9. డీజే టిల్లు
సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ ‘డీజే టిల్లు’. సిద్దూ ఈ మూవీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు దాదాపు రూ. 8 కోట్ల వరకూ లాభాలను తెచ్చి పెట్టింది.
10 బ్రహ్మాస్ర్తం
పురాణ గాధల్లోని అస్ర్తాలపై తీసిన సినిమానే ‘బ్రహ్మాస్ర్త’. ఫుల్ గ్రాఫిక్స్ తో వచ్చిన ఈ మూవీ రూ. 400 కోట్లు పెట్టి వెండితెరకు ఎక్కించారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దీన్ని తెలుగులో రాజమౌళి విడుదల చేశారు. తెలుగులోనే ఈ సినిమాకు రూ. 8 కోట్ల లాభాలు వచ్చాయి.