అటు కేంద్రంలో బీజేపీ.. ఇటు తెంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా, 2019 ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించింది. ఆ తర్వాత దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపించిందనే చెప్పాలి. అప్పటి నుంచీ బీజేపీ స్థాయికి మించిన దూకుడును ప్రదర్శిస్తూ ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో అధికార పార్టీపై ఒంటికాలిపై లేవడం మొదలు పెట్టింది. టీఆర్‌ఎస్ నేతలు కూడా బీజేపీపై కౌంటర్ ఎటాక్‌లు ఇస్తున్నారు.
సీఎం కేసీఆర్ కూడా తడాఖా చూపుతాం అంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. షడన్‌గా ఢల్లీి వెళ్లి ప్రధాని మోదీని, హోం మంత్రి తదితరులను కలిసి వచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌పై మండి పడిరది. బీజేపీ దూకుడుకు తలొగ్గే కేసీఆర్ ప్రధాని శరణు కోరారు అని ఘాటుగానే విమర్శించింది. టీఆర్‌ఎస్ మాత్రం దీన్ని అభివృద్ధి పనుల కోసమే అని చెప్పుకొచ్చింది.
తాజాగా ఖమ్మంజిల్లాలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మంత్రిపై అయితే ఏకంగా పరుష పదజాలమే ఉపయోగించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాక రాజుకుంది. బీజేపీ విమర్శలకు ధీటుగా బదులివ్వడానికి శనివారం టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. మంత్రి పువ్వాడ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడతారని మీడియాకు మెసేజ్ వచ్చింది. ఏమైందో ఏమో గానీ వెంటనే ప్రెస్‌మీట్ క్యాన్సిల్ అయినట్లు మళ్లీ మెసేజ్ పెట్టారు.
దీని వెనుక పెద్ద చర్చే నడిచిందట. ఈ సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి తిరిగి విమర్శలు చేస్తే బీజేపీ మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని, నాగార్జున సాగర్ అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నిక వరకూ వ్యూహాత్మక మౌనం వహించడమే మంచిదని పార్టీలో చర్చ జరిగిందట. ఇప్పుడు అనవసరంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీపై పరుష పద జాంతో విమర్శలు చేయడం కరెక్ట్ అవునో.. కాదో టీఆర్‌ఎస్సే తేల్చుకోలేక పోతోందనే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఒకప్పుడు కేసీఆర్ వాడిన పరుష పదజాలం ఇప్పుడు బీజేపీ కూడా ఉపయోగించడం మొదలు పెట్టడం ఆసక్తికర రాజకీయాలకు తెర తీసేలా ఉంది.