ఇండస్ర్టీలోని ఈ తరం తారలను ‘కాస్టింగ్ కోచ్’ తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకప్పటి తారలకు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. మంచి నటన, హావభావాలు ఉంటే చాలు సినిమా ఛాన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. గతంలో కథ, కంటెంట్ తో సినిమా తీసే వారు.. అవి బాగా హిట్టయ్యేవి కూడా. గత చిత్రాలతో పోలిస్తే ఇప్పుడున్న చిత్రాలు ఆడడంలో చాలా తేడా కనిపిస్తుంది.
అప్పుడు సినిమా విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్ చేసే వారు కూడా కాదు. సినిమా మాత్రం బాక్సాఫీస్ హిట్లు కొట్టేవి. కానీ ఇప్పుడు ప్రమోషన్ కోసం కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్ల వంటిని చేసినా చివరికి ప్రొడ్యూసర్ కు అప్పులే మిగులుతున్నాయి.
సినిమా ఇండస్ర్టీని కుదిపేస్తున్న కాస్టింగ్ కోచ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం వినిపిస్తున్న మాట ‘కాస్టింగ్ కోచ్’. తమ వద్దకు ఛాన్స్ కోసం వచ్చిన తారలను తమ కోరికలు తీర్చాలంటూ వేధించడం మొదలు పెడుతున్నారు కొందరు దర్శక, నిర్మాతలు. ఇది ఒక హీరోయిన్స్ కే కాకుండా కో ఆర్టిస్టుల వరకూ కూడా పాకింది. కొందరు స్టార్లు ఈ విషయాలను ఇండస్ర్టీలో కూడా చెప్పడంతో సదరు వ్యక్తుల పరువుపోయిన ఘటనలు కూడా లేకపోలేదు.
దీనిపై ఇటీవల కీర్తి సురేశ్ కూడా కామెంట్ చేశారు. కాస్టింక్ కోచ్ కు తలవంచేది లేదని, అలాంటి పరిస్థితి వస్తే అన్నీ మానుకొని ఇంట్లో ఉంటానని చెప్పింది. కాస్టింగ్ కోచ్‌పై ఇటీవల సమంత కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఇది ఇప్పుడు ఇండస్ర్టీలో వైరల్ గా మారింది.
డైరెక్టర్ భార్య ముందే క్షమాపణలు చెప్పించుకున్న సమంత
‘ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సమంత. ఆ చిత్రంతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస బెట్టి ప్రాజెక్టులు చేస్తూ వస్తుంది. ఆమె కూడా ఒక దర్శకుడి చేతిలో హెరాస్మెంట్ కు గురైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆమె కొందరిలా తల వంచకుండా ఒక పని చేసిందట. తన వికృత చేష్టల గురించి సమంత సదరు డైరెక్టర్ భార్యకే చెప్పిందట.
దీంతో ఆ డైరెక్టర్ భార్య ముందే సమంత క్షమాపణలు చెప్పించుకుందట. ఆమె డేర్ ను చూసిన సదరు డైరెక్టర్ షాక్ కు గురయ్యారట. ఈ వార్తలు అప్పట్లో బాగా హల్ చల్ చేశాయి. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న సమంత కూడా కాస్టింగ్ కోచ్ కు గురయ్యారంటే ఇక చిన్న చిన్న సినిమాలతో నెగ్గుకస్తున్న హీరోయిన్స్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది.