అతి చిన్న ప్రాంతీయ సినిమాగా విడుదలైన ‘కాంతారా’ ఊహించని విధంగా బాక్సాఫీస్ హిట్ సాధించింది. కన్నడలో కేవలం రూ. 15 కోట్లతో తీసిన ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనుకున్నాడు నిర్మాత, దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకు తగ్గట్లుగానే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, తదితర ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేశాడు.
దీంతో ప్రభంజనం సృష్టించి రూ. 400 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బాహుబలి, కేజీఎఫ్ రికార్డులను కూడా తిరగరాసింది. ఈ సినిమాను ఇటీవల ఓటీటీలో విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ ఫ్లాట్ ఫాంపై మాత్రం ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. వ్యూవ్స్ పరంగా తగ్గకున్నా. అంత పెద్ద కంటెంట్ ఏమీ లేదంటూ కొందరు పెదవి విరిచారు. అయినా ఓటీటీలో కూడా థియేటికల్ లాగానే దూసుకుపోతుంది ఈ సినిమా.
పాన్ వరల్డ్ గా కాంతారా
పాన్ ఇండియా పరంగా ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ పాన్ వరల్డ్ కు తీసుకెళ్లేందుకు రిషబ్ శెట్టి పనులు సన్నాహాలు చేస్తున్నారట. చిత్రాన్ని హాలీవుడ్ లో డబ్ చేసి, మంచి ప్రమోషన్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అందుకు తగ్గట్లుగా ప్లాన్లు కూడా రూపొందించుకుంటున్నారు రిషబ్.
భారీ హాలీవుడ్ సంస్థతో డీల్
పాన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం ఒక హాలీవుడ్ మూవీ సంస్థతో డీల్ కుదుర్చుకున్న చిత్ర యూనిట్. వేగంగా డబ్బింగ్ పనులు పూర్తి చేసి హాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. హాలీవుడ్ ఆడియన్స్ ఎదుటికి ఈ మూవీ వస్తే హాలీవుడ్ లో విడుదలైన మొదటి చిత్రంగా ‘కాంతారా’ చరిత్రలో నిలిచిపోతుంది. పాన్ వరల్డ్ రేంజ్ రిలీజ్ చేసే సత్తా ఇంత వరకూ ఒక్క రాజమౌళికి మాత్రమే ఉంది అనుకున్న వారందరికీ ఈ సినిమా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. రిషబ్ శెట్టి ఈ మూవీని హాలీవుడ్ లో రిలీజ్ చేసి తన ప్రతిభను అక్కడ ప్రదర్శించబోతున్నారు.
ఆ చిత్రాల బాటలోనే కాంతారా
ఇటీవల టాలీవుడ్ కు సంబంధించిన రెండు సినిమాలు ‘త్రిపుల్ ఆర్’, ‘పుష్ప’ విదేశీ ప్రేక్షకుల ముందకు వచ్చాయి. అందులో ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే జపాన్ లో ప్రదర్శనలతో దూసుకుపోతుండగా, ‘పుష్ప’ డిసెంబర్ 3న రష్యాలో రిలీజ్ కాబోతుంది. వీటిని బాగా పరిశీలించిన రిషబ్ శెట్టి కూడా తన మూవీ ‘కాంతారా’ను యూఎస్ లో ప్రదర్శనకు నిలపాలని అనుకున్నాడట. ఆ దిశగా వేగంగా పనులు కూడా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.
రీజనల్ లాంగ్వేజ్ లో
ఇక హాలీవుడ్ లో ఈ మూవీ విడుదలైతే సౌత్ సినిమాలకు బిగ్ మార్కెట్ గేట్లు ఓపెన్ చేసినట్లేనని ఇండియన్ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ అటుంచితే ఈ మూవీ హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తుందో..? లేదో..? చూడాలి. రీజనల్ లాంగ్వేజ్ లో రిలీజై పాన్ ఇండియా వ్యాప్తంగా ఆయా భాషల్లో ప్రేక్షకులను అలరించిన ‘కాంతారా’ హాలీవుడ్ లో కూడా రికార్డులు సాధించాలని కోరుకుందాం.