కలిసి పోటీ చేస్తే పవన్ అడిగే సీట్లు ఇవే..

0
583

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆదివారం జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరి చర్చలు కొనసాగాయి. ఏపీలో జీవో-1, బాబు కుప్పం పర్యనలో చోటు చేసుకున్న పరిణామాలపై మాత్రమే చర్చించినట్లు ఇద్దరూ మీడియాకు చెప్పుకచ్చారు. అయితే వీరు ఇలా భేటీ కావడం ఇదే మొదటి సారి కాదు. చాలా సార్లు ఇలాగే జరిగింది.

కానీ నిన్నటి సమావేశం మాత్రం బాగా చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఇంకా ఎన్నికల గడువు ఏడాది మాత్రం ఉండడంతో వేడి రాజుకుంది. గతం నుంచి చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇరు పార్టీల పొత్తు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పొత్తు కుదిరితే జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది..? ఆ స్థానాలే ఎందుకు..? దానికి గల కారణాలను తెలుసుకుందాం.

పొత్తులు తప్పేలా లేవు

ఏపీలో జగన్ సర్కార్ ను ఎదుర్కోవాలంటే పొత్తులు తప్పవు. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉంటాయి. ఒక వేళ్ పొత్తు పెట్టుకోకుండా ఇటు టీడీపీ ఎంత నష్టపోతుందో.. జనసేన కూడా అంతే నష్ట పోతుంది. దీంతో ఇద్దరు ఒక అంచనాకు వచ్చి పొత్తు పెట్టుకుంటే జగన్ పై పట్టు పెంచవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన బలోపేతంగా ఉన్న స్థానాలపై పవన్ కళ్యాణ్ బాగా దృష్టి పెట్టారు. పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడగవచ్చు. ప్రస్తుతం కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాలపై జనసేన ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది.

ఈ ప్రాంతాలను కోరనున్న పవన్ కళ్యాణ్

కుల ప్రాతిపదికన చూసుకుంటే కాపులు ఎక్కువగా ఉన్న రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలపై పవన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. దీంతో పాటు విశాఖపట్నం నార్త్, విజయవాడ పశ్చిమ, తిరుపతి, గాజువాక, చీరాల, చిత్తూరు, భీమవరం, భీమిలి, అనంతపురం, చోడవరం, రాజనాగారం, పిఠాపురం, రాజోలు, పెందుర్తి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, దర్శి, గిద్దలూరు, నరసాపురం, యలమంచిలి, కైకలూరు, కాకినాడ రూరల్ వంటి స్థానాలను జనసేన అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తిరుపతి నుంచే పోటీ చేసే అవకాశం

జనసేనకు గత ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పాటు తిరుపతి, పుంగనూరు, పలమనేరు వంటి స్థానాల్లో జనసేన బాగానే ఓట్లను రాబట్టగలిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పక్కా సమాచారంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తమ అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో హింట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఆ స్థానాల్లో ప్రణాళికతో వ్యవహరించాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. అందుకే ఆ స్థానాలపై గట్టి నిఘా పెడుతున్నారు.

పవన్ కోరబోయే స్థానాల్లో టీడీపీ బలంగానే

అయితే పవన్ కళ్యాణ్ కోరే అవకాశాలు ఉన్న చాలా ప్రాంతాలు టీడీపీ గుప్పిట్లో, టీడీపీకి పట్టున్న స్థానాలు వీటిని జనసేను చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ పొత్తు నేపథ్యంలో జనసేనకు ఇస్తే టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కూడా జనసేన ఖాతాలో కలుస్తుంది. దీంతో క్రమ క్రమంగా ఓటు బ్యాంక్ ను పూర్తిగా టీడీపీ కోల్పోయే ప్రమాదంలో పడుతుంది. ఏది ఏమైనా ఎన్నికల వరకూ ఆగాల్సిందే.