చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డ్ నెలకొల్పారు. ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సైతం తొలి ముఖ్యమంత్రిగా చేశారు. అర్ధశతాబ్ధపు రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను చేపట్టారు. ఎంతో మంది నాయకులను దగ్గర నుంచి చూశారు. మరెంతోమంది నాయకులను తాను దగ్గరకు తీసుకుని పెద్దవారిని చేశారు.
75 సంవత్సరాల వయసులో ఇప్పటికీ 18 గంటలు పనిచేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎప్పటికి ఎయ్యది సేయ తగునో చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అవసరం ఉంటే రాజకీయంగా తనకన్నా చిన్నవారైనా సరే ఈయనే వెళ్లి మరీ కలిసొస్తుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కోకొల్లలు.
జగన్ అలాచేస్తే బాబుకు పవన్ రాం రాం
తాజాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరపడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేస్తున్న విషయం ఇప్పటికే అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు కూడా ఇంతకు ముందే ప్రకటించారు కూడా.
తాజాగా చంద్రబాబు పవన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలవడంలో అంతర్ధానంగా రెండు విషయాలు దాగి ఉన్నాయి. ఒకటి రాబోయే ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్‌ను కలవడం ద్వారా ఆయన్ను తాను గౌరవిస్తున్న విధానాన్ని అటు ప్రజలకు, ఇటు జనసేన కేడర్‌కు తెలియజెప్పటం.
దీని ద్వారా చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఎంత పెరుగుతుందో.. పవన్ కల్యాణ్ ఇమేజ్ కూడా అంతే పెరుగుతుంది. అలాగే సుధీర్ఘ కాలంగా టీడీపీ వేళ్లూనుకుని ఉండటంతో.. క్షేత్రస్థాయిలో ఒకింత తెలుగుదేశం పార్టీ నాయకులదే పైచేయిగా ఉంటుంది.
దీని వల్ల ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు సహకరించుకునే విషయంలో టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించకుండా.. అధినేత చంద్రబాబే ఉమ్మడి ప్రయోజనాల కోసం దిగివస్తే మనం పట్టుదలలకు పోవడం మంచిది కాదు అనే మెసేజ్ టీడీపీ క్యాడర్‌కు పంపడం.
ఇలా ఉభయ కుశలోపరిగా ఉంటుందనే భావనతోనే చంద్రబాబు పవన్ కల్యాణ్ నివాసానికి స్వయంగా వెళ్లారు. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో జనసేన పోటీలో లేనప్పటికీ టీడీపీGబీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంలో కూడా చంద్రబాబు నాడు పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారు. దటీజ్ చంద్రబాబు మార్క్ పాలిటిక్స్.