పాలిటిక్స్‌లో ప్రాంతీయ పార్టీలదో తలనొప్పి వ్యవహారం. జాతీయ పార్టీల్లో ఉన్న స్వేచ్ఛ, అవకాశాలు, స్వయంవృద్ధి ఇక్కడ అంత ఈజీ కాదు. దాదాపు రాచరికంతో సమానమైనది ప్రాంతీయ పార్టీల పాలన.
ఆ పార్టీ అధ్యక్షుడు లేదా వారి కుటుంబ సభ్యుల సూచన మేరకే ఎంతటి నాయకుడైనా నడుచుకోవాలి ఇక్కడ. కాదని ఎదురు తిరిగితే రాజకీయ జీవితం శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత రాజునని ఫీలవుతున్నాడు. తన పాలనలో తనకు తెలియకుండా చీమ చిటుక్కుమన్నా ఊరుకునేలా లేడు. తన అనుమతి లేకుండా కనీసం సన్నిహితుల ఇళ్లల్లో విందులకు కూడా హాజరు కాలేని పరిస్థితి.
టీడీపీ గెలుపు గుర్రమని ఒప్పుకున్న వైసీపీ
ఇలా ఆయనకు సమాచారం ఇవ్వకుండా ఓ విందులో పాల్గొన్నందుకు పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలపై ఫైర్ అయ్యారట. జగన్ కోపాన్ని చూసి వారు షాక్ తిన్నారట.
ఈ మొత్తం ఎపిసోడ్‌కు కారణం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మొన్న పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన విందు. తెలంగాణ సీఎంగా తాను ఎన్నికవ్వడంతో అప్పటికే తాను పార్లమెంట్ సభ్యుడినైనందున రేవంత్‌రెడ్డి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులకు ఢల్లీిలో విందును ఏర్పాటు చేశారు.
ఈ విందుకు వివిధ పార్టీల నుంచి ఎంపీలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ ఎంపీలు రఘురామకృష్ణంరాజుతో పాటు విజయసాయిరెడ్డి, మిధున్‌రెడ్డిలు కూడా వెళ్లారు. ఈ విషయం సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ చెవిలో వేశాడట.
మీ అనుమతి లేకుండానే వెళ్లారని జగన్‌ను ఒకింత రెచ్చగొట్టారట. దాంతో జగన్ విజయసాయి, మిధున్‌రెడ్డిల పిలిపించి క్లాస్ పీకారట. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తూ..
పార్టీ అనుమతి లేకుండా ఆ విందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారట. అప్పటికి నీళ్లు నమిలి బయట పడిన వీరు.. తమ సహచర ఎంపీ ఒకరితో…
ఓ పార్లమెంట్ సభ్యుడు విందు ఇస్తే దానికివెళ్లడం కూడా తప్పంటే ఎలా?. పార్టీ వైరాలను వ్యక్తిగత వైరాలుగా మార్చుకోలేం కదా?.
పైగా అతను తెలంగాణ సీఎం. మన ఆస్తులు, వ్యవహారాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మనవేంటి ఈయన ఆస్తులు కూడా అక్కడేగా ఉంది. ఆ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడితే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారట.