ఉదయం… ఒకప్పటి పత్రికారంగ సంచలనం. దాసరి నారాయణరావు సారధ్యంలో మొదలైన ఉదయం దినపత్రిక తెలుగునాట పత్రికా ఫీల్డ్‌న్, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
1984 డిసెంబర్ 30వ తేదీన నాటి ముఖ్యమంత్రి యన్.టి. రామారావు చేతులు మీదుగా తొలి సంచిక వెలువడిరది. అప్పటి వరకూ పత్రికా రంగంలో ఈనాడు మంచి స్థాయిలోకి ఉంది.
ఉదయంకు ముందు కొన్ని పత్రికలు వచ్చినా.. ఈనాడుకు ముందు నుంచీ కొన్ని పత్రికలు ఉన్నా ఈనాడు దూకుడుని అవి అందుకోలేక పోయాయి అన్నది వాస్తవం.
అలా అప్రతిహతంగా సాగుతున్న ఈనాడుకు ముచ్చెమటలు పట్టించిన పత్రిక ‘ఉదయం’. ప్రారంభం నుంచి అనేక సంచలన కథనాలతో అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమా రంగంలోనూ దూసుకు పోయింది. దీనికి తోడు ప్రజాసమస్యలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది.
అప్పట్లో 2,50,000 సర్క్యులేషన్‌కి చేరడం ఉదయం సత్తాను తెలియజేస్తుంది. అయితే అనివార్య కారణాల వల్ల కొద్ది సంవత్సరాలకే అది మూత పడిరది.
ఆ తరుణంలో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు మాగుంట సుబ్బరామిరెడ్డికి ఈ పత్రికను దాసరి అమ్మేశారు.
మళ్లీ పునరుద్ధరణకు సిద్ధం అవుతున్న తరుణంలోనే మాగుంటను నక్సల్స్ కాల్చి చంపేశారు. దీని వెనకాల ఏవేవే రాజకీయ కారణాలు, ఇతరిత్రా అనేక కారణాలు ఉన్నాయనే పుకార్లు కూడా వచ్చాయి.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీ మళ్లీ ఉదయం పత్రికను పునరుద్ధరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
దీనికి సంబంధించిన చర్చలు కూడా ప్రారంభం అయ్యాయట. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు క్రితం వ్యవహారం కావడంతో చిక్కుముళ్లు చాలానే ఉన్నాయట.
అయినా వాటిని విప్పి, ఉదయంను మళ్లీ ప్రజల ముందుకు తేవటానికి ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక పేరున్న దినపత్రిక సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఓ కీలక మాజీ రాజ్యసభ సభ్యుడి ఆధ్వర్యంలో మంతనాలు సీరియస్‌గానే సాగుతున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ తర్వాత దీనికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరగొచ్చునట. పత్రికా రంగంలో సంచలన సృష్టించిన ఉదయం మళ్లీ మార్కెట్‌లోకి వస్తే తప్పకుండా ప్రారంభంలోనే మంచి సర్క్యులేషన్‌కు అవకాశం ఉందనేది వాస్తవం.