అందరూ పంచ్ డైలాగ్‌లు సినిమాల్లోనే ఉంటాయని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. కానీ రాజకీయాల్లో కూడా అద్భుతమైన పంచ్ డైలాగ్‌లకు కొదవేలేదు.
ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో పంచ్‌లకన్నా ఇవే ఒక్కోసారి పవర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాంటి పంచ్ డైలాగ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఒకటి వదిలారు.
ఇదే ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఈ భేటీకి మీడియాలో కూడా మంచి స్పేస్ దొరికింది. ఏబీఎన్ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ సమావేశాన్ని బీఆర్‌ఎస్ సమావేశంగా పేర్కొన్నారు కొలికపూడి.
అదెలా అంటే.. బీఆర్‌ఎస్ అంటే.. బ్రదర్స్ రహస్య సమావేశం అట. ఈ పంచ్ విన్నవారు ఓ పట్టాన మర్చిపోయే అవకాశం లేదు. అంత పదునైన పంచ్ ఇది.
ఇంకా ఆయన మాట్లాడుతూ… దీన్ని రహస్య సమావేశం అని ఎందుకు అంటున్నాను అంటే.. వాళ్లు లోపల ఏం మాట్లాడుకున్నారో బయటకు వచ్చి చెబితే అది బహిరంగ కలయిక అవుతుంది.
ఇద్దరిలో ఎవరూ మీడియా ముందుకు వచ్చి ఏం చర్చించారో చెప్పకుంటే అది బీఆర్‌ఎస్ (బ్రదర్స్ రహస్య సమావేశం) కాక మరేమవుతుంది.
జగన్ నేను మీ కోసమే వచ్చాను అనంగానే కేసీఆర్ లాంటి రాజకీయ ఉద్దండుడు కూడా బోల్తా పడ్డాడు. అసలు జగన్ హైదరాబాద్ వచ్చింది ఆయన తల్లి విజయమ్మను కలవటానికి.
షర్మిళ అన్నకు తన కుమారుడి పెళ్లికి రమ్మని కార్డు ఇవ్వటానికి తాడేపల్లి ప్యాలెస్ వెళ్లినప్పుడు అక్కడ విజయమ్మగారు లేరు. జగన్‌గారు తల్లిని కలవటానికి వచ్చినప్పుడు షర్మిళ ఢల్లీి ఉన్నారు.
ఇది ఎంత పకడ్బందీ ప్లాన్‌తో జరిగిందో చూడండి. ఇది మూడు పాత్రల నాటకం ఇందులో ఎక్కడా మూడు పాత్రలు ఒక్క సీన్‌లో కనపడం లేదు.
కాబట్టి జగన్‌గారు హైదరాబాద్ వచ్చింది వాళ్ల అమ్మగారిని కలవటానికే. చెల్లి అన్నను కలిస్తే వార్త, కొడుకు అమ్మను కలిస్తే డిబేట్ ఇది ఏ కుటుంబంలోనూ జరగదు.
షర్మిళ అన్నకు పెళ్లికార్డు ఇవ్వటానికి వెళ్లిన ఫొటోలు గానీ, వీడియో గానీ ఎందుకు బయటకు రాలేదు. దీన్నిబట్టి జగన్ కుటుంబంలోను, పార్టీలోనూ అంతర్గతంగా అల్లకల్లోలం జరుగుతోంది అన్నారు.