మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో సుధీర్ హీరోగా వచ్చిన చిత్రం ‘గాలోడు’. ఇందులో సుధీర్ సరసన గెహ్నా సిప్పీ నటించింది. ఈ మూవీకి పులిచర్ల రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా వ్వవహరించాడు. ప్రకృతి సమర్పణలో ‘సంస్కృతి ఫలింస్’ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలవగా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీ సక్సెస్ పై దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
డైలాగ్ రైటర్ గా కూడా పని చేశా
గాలోడు కమర్షియల్ హిట్ కావడం ముందే ఊహించామని చెప్పారు రాజశేఖర్. గతంలో తాను కమర్షియల్ డైరెక్టర్స్ వద్ద పని చేశానని, తను పని చేసిన మూవీస్ అన్నీ కమర్షియల్ హిట్లు సాధించడంతో ఆ అనుభవంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన పేర్కొన్నారు. తాను డైలాగ్ రైటర్ గా కూడా పని చేశాను కాబట్టి కథలో స్లో అనిపిస్తే డైలాగ్స్ తో మేనేజ్ చేయడం బాగా తెలుసు అంటూ చెప్పుకచ్చాడు. అది ఇప్పుడు ప్లస్ గా మారిందన్నాడు. తాను ఇప్పటి వరకూ ఘోస్ట్ రైటర్ గానే పని చేశానని ఎప్పటికైనా మంచి సక్సెస్ సాధిస్తానని నమ్మకంతో ఉన్నానని చెప్పారు.
సాఫ్ట్ వేర్ సుధీర్ కూడా కమర్షియల్ గా హిట్
ఈ మూవీకంటే ముందు సుధీర్ తో ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా తీశాను. కామెడీ టచ్ ఉన్న హీరో కోసం వెతకడం మొదలు పెట్టాం. ఈ సందర్భంలో ఒక హీరోతో ప్లాన్ చేద్దాం అనుకున్నాం. కానీ అతని డేట్స్ దొరకకపోవడంతో కామెడీ టచ్ ఉన్న సుధీర్ ను ప్రాజెక్టులోకి తీసుకున్నాం. అప్పటి నుంచి మా జర్నీ స్ట్రాట్ అయింది అంటున్నాడు రాజశేఖర్. సాఫ్ట్ వేర్ సుధీర్ కూడా కమర్షియల్ గా హిట్ అయ్యింది. అయితే అప్పుడున్న సినిమాల పోటీలో తట్టుకోలేకపోయిందని చెప్పుకచ్చాడు. ఆంధ్రాకు తానే డిస్ర్టిబ్యూటర్ గా పని చేశాను. అక్కడ వచ్చిన ఫ్రాఫిట్ తోనే ‘గాలోడు’ తీసినట్లు చెప్పారు.
సుధీర్ రష్మీతో తీద్దాం
సుధీర్ ఇమేజ్ పై మొదట్లో కొంత సందేహమే ఉన్నా టీజర్ రిలీజ్, ఫస్ట్ లుక్ తదితరాలతో ఆయనకు సోషల్ మీడియా నుంచి వచ్చిన క్రేజ్ ను చూస్తే అర్థమైంది. ఈ చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందని అప్పుడే అనుకున్నాను. మొదట సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు కథలను యాంకర్ రష్మీకి చెప్పాం. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. రష్మీ, సుధీర్ కాంబోలో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను అన్నాడు రాజశేఖర్. తన వద్ద ‘గజ్జల గుర్రం’ అనే కథ ఉందని, దీన్ని డెవలప్ చేసి సుధీర్ రష్మీతో తీద్దాం అనుకుంటున్నానని చెప్పాడు డైరెక్టర్. ఇద్దరి మధ్య మంచి కెమిస్ర్టీ ఉన్నట్లు టాక్ ఉంది. ఇది ఈ చిత్రానికి మంచి హెల్ప్ అవుతుందని చెప్పుకచ్చారు.
గాలోడికి ప్రశంసలతో పాటు విమర్శలు
గాలోడు సినిమాకి డైరెక్షన్ తో పాటు ప్రొడక్షన్ పనులు కూడా తానే చేయాల్సి వచ్చిందని, చెప్తూనే రెండు చేయడం కష్టతరమవుతుందని చెప్పాడు. కెమెరామెన్ రాం ప్రసాద్ చాలా బిజీగా ఉండడంతో ఆయన కోసం 6 నెలలు వేయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ సినిమా విజువల్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మేము వెయిట్ చేసిన దానికి ఫలితం దగ్గిందని చెప్పాడు. మూవీలో కొత్తదనం ఎంత ఉన్నా ఎంటర్ టైనమెంట్ లేకపోతే సినిమాను ప్రేక్షకులు ఆదరించరు. గాలోడికి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. తర్వాతి చిత్రాల్లో వాటిని సరిదిద్దుకుంటాను.