అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ పాన్ ఇండియా లెవల్ ను దాడి పాన్ వరల్డ్ రేంజ్ కు వెళ్లింది. మొదట షూటింగ్ సమయంలో కేవలం ప్రాంతీయ భాషలో చాలనుకున్న సినిమా పాన్ ఇండియాకు చేరింది. బాక్సాఫీస్ హిట్లను తిరగరాస్తూ క్రమంగా ఇప్పుడు విదేశాలలో కూడా విడుదలయ్యే వరకూ వెళ్లింది. ఇటీవల కేరళలో రీ రిలీజ్ కూడా చేసేందుకు అక్కడి డిస్ర్టిబ్యూటర్లు, అభిమానులు ఇంట్రస్ట్ చూపడంతో పుష్ప రీలీజ్ డేట్ నే రీ రిలీజ్ డేట్ మార్చి అదే రోజు అక్కడ విడుదల చేయనున్నారు. ఇలాంటి రికార్డులు తిరగరాస్తుంది పుష్ప.
పుష్ప2ను కూడా అంతకంటే బిగ్ రేంజ్ లో
పుష్ప డైరెక్టర్ సుకుమార్ దీనికి సీక్వెల్ కూడా మొదలు పెట్టాడు. ప్రస్తుతం అది షూటింగ్ జరుపుకుంటోంది. ‘పుష్ప’ బాక్సాఫీస్ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప2ను కూడా అంతకంటే బిగ్ రేంజ్ లో తెరకెక్కించాలనుకుంటున్నాడు సుకుమార్. దీనికి ఏకంగా రూ. 350 కోట్ల బడ్జెడ్ కేటాయించారంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థమవుతుంది. దీని కోసం తను రాసుకున్న పాత స్క్రిప్ట్ లో కూడా చాలా మార్పులు చేశారట సుకుమార్. పుష్పలో పాత్రలతో కలిసి సెకెండ్ పార్ట్ లో మరిన్ని పాత్రలు యాడ్ అవుతాయని చెప్పారాయన.
సోషల్ మీడియాలో మరో వార్త
ఇంకొందరు నటీ , నటుల కోసం వేట ప్రారంభించింది పుష్ప యూనిట్. ఒక పాత్రను బాలీవుడ్ లోని ఒక సీనియర్ నటుడు వేయనున్నాడట. పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ నటిస్తున్నాడన్న వార్తలు కొన్ని నెలలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలు నిజం కాదని గతంలోనే చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. ఇప్పుడు మళ్లీ ఇదే తరహాలో సోషల్ మీడియాలో మరో వార్త కూడా విపరీతంగా ట్రోల్ అవుతూ వస్తోంది. బాలీవుడ్ మూవీ ‘టైగర్ జిందాహై’ సినిమాలో విలన్ గా నటించిన సజ్జాదవ్ డెలాఫ్రూజ్ పుష్ప 2లో ఒక పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ మధ్యనే రష్యా వెళ్లింది
దీనిపై ఇంత వరకూ చిత్ర యూనిట్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ పుష్ప 2లో మాత్రం పాత్రల పరంగా స్టార్ పొజిషన్ లో ఉన్న నటులు కనిపిస్తారని మాత్రం తెలుస్తుంది. పుష్ప ప్రస్తుతం రష్యాలో విడుదలకు సిద్ధమైంది. అక్కడ ఈ సినిమాను రష్యన్ లాంగ్వేజీలో డబ్ చేసి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేసింది. దీని కోసం మన పుష్ప యూనిట్ కూడా ఈ మధ్యనే రష్యా వెళ్లింది. అక్క చిత్ర విశేషాలను అక్కడి మీడియాకు వివరించింది.
అభిమానులు విపరీతంగా ట్రోల్
అక్కడి ప్రేక్షకులు ఈ మూవీని ఇష్టపడతారని అందుకే ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు చిత్ర యూనిట్. అయితే రష్యన్ లాంగ్వెజ్ లో డబ్ అయిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ను రష్యన్ సినీ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.