రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో వస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ రామాయణం ఇతిహాసం నేపథ్యంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో భారీ స్థాయిలో ఈ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దసరాకు ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూసిన అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వచ్చాయి. దీంతో మళ్లీ ఒకసారి పరిశీలించాలని యూనిట్ భావిస్తోంది.
వచ్చే సంక్రాంతికి రానట్లే..!
సంక్రాంతి-2023కు ‘ఆదిపురుష్’ విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. అయితే ట్రైలర్, టీజర్ పై వచ్చిన భిన్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. ప్రధాన పాత్రల చిత్రణ సరిగా లేదని, ఇలా అయితే భారీ చిత్రం స్థాయిలో ఉండబోదని నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు కామెంట్లు చేశారు. దీంతో మూవీ యూనిట్ సంక్రాంతి రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసింది. మరో సారి వీఎఫ్ఎక్స్ రీవర్స్క్ చేస్తున్నట్లు ఇండస్ర్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’ను 16 జూన్, 2023న మొదట 3డీ, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ అధికారికంగా తెలిపాడు.
మరో ఆరు నెలలు సమయం
ప్రేక్షకులకు మంచి అనుభూతి కల్పించేందుకు మరింత సమయం కసరత్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి మరో ఆరు నెలలు సమయం తీసుకుంటారని టాలీవుడ్ నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. జూన్ లో కూడా ఇదే విధంగా పోస్ట్ పోన్ చేస్తే ‘ఆదిపురుష్’ కన్నా ముందు ‘సలార్’ వస్తుందని ఇండస్ర్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘సలార్’ ముందే వస్తుందా..!
‘కేజీఎఫ్’ లాంటి బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ మూవీ ‘సలార్’. ఇందులో ప్రభాస్ వైలెంట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడట. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. మూవీని 28 సెప్టెంబర్, 2023ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది కూడా. ‘ఆది పురుష్’ రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అయితే ‘సలార్’తోనే ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఈ రెండు చిత్రాల విడుదల నేపథ్యలో ప్రభాస్ ను దాదాపు సంవత్సరం పాటు బిగ్ స్ర్కీన్ పై చూసే అవకాశాన్ని అభిమానులు కోల్పోతారు. ఈ మధ్యలో మారుతి డైరెక్షన్ లో వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ఈ గ్యాప్ ను ఫిల్ చేస్తుందో చూడాలి మరి.
అన్నీ పుకార్లేనా
‘ఆది పురుష్’ రిలీజ్ పై వస్తున్నవన్నీ పుకార్లే. యూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన లేదు. కానీ బెటర్ విజువల్స్ తో అందించేందుకు టీం భారీగా కసరత్తు చేస్తుందని మాత్రం తెలుస్తుంది. ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుందని మాత్రం చెప్పకతప్పదు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీ సనన్ కనిపిస్తుండగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ గా దేవదత్త, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.