సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకోచూస్తోంది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆంధ్ర ప్రదేశ్ కి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?,
సీఎం జగన్ మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాడా, లేకపోతే టీడీపీ – జనసేన ప్రభుత్వం స్థాపిస్తుందా అనే చర్చలు నడుస్తున్నాయి.
స్వచ్ఛమైన సర్వేలను అనుసరిస్తే, ఈ ఎన్నికలలో జగన్ తలక్రిందులుగా తపస్సు చేసినా గెలిచే అవకాశం కనిపించడం లేదు. సర్వేలు మొత్తం టీడీపీ మరియు జనసేన కి అనుకూలంగా ఉన్నాయి.
ముఖ్యంగా కోస్తాంధ్ర మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేసేలాగా కనిపిస్తుంది. గోదావరి జిల్లాల్లో అయితే వైసీపీ పార్టీ మూత పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆ రెండు జిల్లాలో ఉండే వైసీపీ నాయకులూ ఇప్పుడు టీడీపీ – జనసేన పార్టీలలో చేరేందుకు క్యూలు కట్టేస్తున్నారు. అసలే వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనుకుంటుంటే,
మరోపక్క జగన్ సిట్టింగ్ ఎమ్యెల్యేల మార్పిడి కారణంగా రోజుకి ఒకరు వైసీపీ నుండి బయటకి వచ్చేస్తున్నారు. ఉదాహరణకి వారం రోజుల క్రితం వైసీపీ పార్టీ లో చేరిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు,
నిన్న ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకి వచేసాడు. కారణం గుంటూరు ఎంపీ టికెట్ కచ్చితంగా ఇస్తానన్న జగన్, ఇప్పుడు మాట మార్చి నర్సాపురం టికెట్ ఇస్తాను అనడం తో మనస్తాపానికి గురైన అంబటి రాయుడు పార్టీ ని వీడి బయటకి వచ్చినట్టు తెలుస్తుంది.
ఇలా కేవలం ఆయనొక్కడే కాదు, ఎంతో మంది నాయకులూ సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి టీడీపీ మరియు జనసేన కి జంప్ చెయ్యబోతున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఉన్నటువంటి ముఖ్యమైన వైసీపీ లీడర్స్ మొత్తం ఆ పార్టీ ని ఒక్కొక్కరిగా వీడుతూ జనసేన పార్టీ లోకి చేరిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తమ నియోజకవర్గాల్లో పర్యటించిన అంబటి రాంబాబు మరియు అవంతి శ్రీనివాస్ లపై జనాలు తిరగబడ్డారు.
దానికి సంబంధించిన వీడియోలు చూస్తే అర్థం అవుతుంది , వైసీపీ పై జనాల్లో ఎంత నెగటివిటీ ఉంది అనేది. ఎమ్యెల్యే అభ్యర్థులు స్వేచ్ఛగా జనాల్లో తిరగలేని పరిస్థితి,
ఓట్లు అడిగితె కొట్టేలాగా ఉన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికలలో జనాల మూడ్ టీడీపీ – జనసేన వైపే ఉందని ఈ సంఘటనలు మొత్తం చూసాక అర్థం అవుతుంది, మరి తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.