అసలే జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ని ఎదురుకుంటున్న వైసీపీ పార్టీ కి ఇప్పుడు తెలంగాణ లో రేవంత్ రెడ్డి పెద్ద తలనొప్పిగా మారాడు. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వడం వల్ల జగన్ కి వచ్చిన నష్టం ఏమిటి? అని మీలో అందరూ అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరంభం అయ్యినప్పటి నుండే దూకుడు గా ఉన్నాడు. అప్పట్లో మన ముఖ్యమంత్రి జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పని తీరు రేవంత్ రెడ్డి లో కనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు.
అందుకు నిదర్శనం ‘ప్రజా దర్భార్’ అనే కార్యక్రమం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి మొదలు పెట్టిన కార్యక్రమం ఇది. గతం లో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే చేసాడు. ప్రతీ రోజు ఉదయం తన వద్దకి వచ్చిన జనాల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించేవాడు. వారి కష్టాలను, సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేవాడు.
రాజకీయ సన్యాసం తీసుకోబోతున్న బాలినేని!
ఆ తర్వాత ఆ అర్జీలను పరిశీలించడానికి ఒక ప్రత్యేకమైన సెల్ ని ఏర్పాటు చేసాడు. తద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు పట్టువీడకుండా ఉండేవాడు. అదే పద్దతి ని రేవంత్ రెడ్డి కూడా అనుసరిస్తున్నాడు. ఇలా మన ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చెయ్యట్లేదు అని ఇప్పుడు జనాల్లో మెదులుతున్న ప్రశ్న. జనాలతో మమేకం అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకునే కార్యక్రమం కాసేపు పక్కన పెడితే, అసలు జగన్ మీడియా తో మాట్లాడిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
‘స్పందన’ అనే కార్యక్రమం మొదలు పెట్టాడు, కానీ ఈ కార్యక్రమం లో కేవలం ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లు, కలెక్టర్లు, మేయర్లు మాత్రమే హాజరు అయ్యేవారు. వాళ్ళ ద్వారానే పనులు చేయించే వాడు. దీనికంటే రేవంత్ రెడ్డి ప్రజా దర్భార్ కార్యక్రమం బాగుంది కదా, జగన్ ఎందుకు అలా చెయ్యడం లేదు? ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రతీ ఊరు తిరిగి జనాలను తడిమి ముద్దులు పెట్టుకున్న జగన్ ఇప్పుడు జనాలతో కలిసేందుకు ఎందుకు ఇష్టపడడం లేదు?
ఆయనకీ ప్రజల్లో వ్యతిరేకత ఎదురైంది. వాళ్ళ నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను అనే భయం జగన్ లో ఉండిపోయిందా?, అందుకే ఇలా చేస్తున్నాడా? వంటి సందేహాలు జనాల్లో నెలకొన్నాయి. ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికైనా జగన్ జనాల్లో తిరుగుతాడో లేదో చూడాలి.