జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. అవతార్ ఫస్ట్ పార్టు వచ్చి దాదాపు పదేళ్లు పూర్తయ్యింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించిన కామెరూన్ దీన్ని 2022లో తెస్తామని కూడా చెప్పాడు. అనుకున్న సమయానికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. పాన్ వరల్డ్ గా విడుదలవుతున్న చిత్రం డిసెంబర్ 16న థియేటర్స్ లోకి రానుంది. ఫస్ట్ పార్టును చూసిన అవతార్ ఫ్యాన్స్ సెకెండ్ పార్టు కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఎదురుచూపు ఫలించింది.
పోటీలో లేని చిత్రాలు
ఇండియన్ ఫిలిం మార్కెట్లో కూడా అవతార్ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. దీని దెబ్బకి అప్పట్లో మూవీస్ కలెక్షన్లున కూడా భారీగా కోల్పోయాయి. దీంతో నిర్మాతలు అవతార్ 2కు రిలీజ్ సమయంలో ఎలాంటి మూవీని కూడా రిలీజ్ చేసేందుకు సాహసించడం లేదు. ఈ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తే భారీగా కలెక్షన్లు పడిపోతాయని అనుకున్న నిర్మాతలు చిన్న తరహా చిత్రాలను తప్పించి ఓ మోస్తారు, పెద్ద చిత్రాలను విడుదల చేయడం లేదు. డిసెంబర్ 16కు ముందు వారం డిసెంబర్ 9న ఒక్క రోజే దాదాపు 17 చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు.
అవతార్ ప్రభావం
ఇక డిసెంబర్ 16న ‘శాసన సభ’ ‘పసివాడి ప్రాణం’ చిత్రాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్ పై అవతార్ ప్రభావం బాగానే ఉండబోతోందని తెలుస్తోంది. కామెరూన్ గ్రాఫిక్స్ విజువల్స్, భారీ వండర్ పై నమ్మంతోనే భారీ కలెక్షన్లను కొల్లగొడుతుందని నిర్మాతలు అనుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో ఇప్పటికే టిక్కెట్ల అమ్మకం కూడా ప్రారంభమైంది. చాలా వరకు థియేటర్లలో అవతార్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక వచ్చే వారాంతం వరకూ దాదాపు థియేటర్లలో అవతార్ చిత్రం ప్రదర్శించనున్నారు. రీసెంట్ గా రిలీజైన హిట్: ది సెకండ్ కేస్ డిసెంబర్ 16వ తేదీ వరకూ ఫుల్ రన్ పూర్తి చేస్తుంది.
అవతార్ కు పోటీగా అవి వస్తే బాగుండు
ఇక 9వ తేదీ విడుదలైన సినిమాలలో చాలా వరకూ వారంపైగా థియేటర్లలో ఉండేలా కనిపించడం లేదు. దీన్ని బట్టి డిసెంబర్ 16 తర్వాత వారం మొత్తం అవతార్ 2నే ఉండబోతోంది. అవతార్ కు పోటీగా మీడియం రేజ్ సినిమాలను తెస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అవతార్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేదని, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ చూసేందుకు ఇష్టపడే చాన్స్ లేదని చెప్తున్నారు. వారి కోసమైనా ఒక సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
థియేటర్లన్నీ బిజీ
ఇక డిసెంబర్ 23న నిఖిల్, అనుపమా పరమేశ్వర్ నటించిన ‘18 పేజెస్’ మూవీ, మాస్ మహరాజ్ నటించిన ‘ధమాకా’ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఒక్కటైనా అవతార్ తో పాటే రిలీజ్ చేస్తే బాగుండేదని అంటున్నారు. అవతార్ మేనియాతో థియేటర్లన్నీ బిజీగా ఉంటాయని అలాంటి సినిమాలను ఇష్ట పడని వారు ఈ సినిమాలకు వస్తుంటారని, దీంతో ఆ మూవీస్ కు కలెక్షన్లు పెరుగుతాయని కూడా విశ్లేషిస్తున్నారు.