ఒకప్పుడు మన తెలుగు హీరోలు బాలీవుడ్ లో ఖాన్స్ రేంజ్ మార్కెట్ ని కలలో అయినా చూస్తారా అని అనుకునేవాళ్లు ట్రేడ్ పండితులు. నిజానికి వాళ్లకి ఉన్నటువంటి మార్కెట్ ఎవరికీ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కానీ ఎప్పుడైతే రాజమౌళి మరియు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటారో అప్పుడు బాలీవుడ్ ఖాన్స్ వీళ్లిద్దరి ముందు చాలా చిన్నగా అనిపించారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలి.
ప్రస్తుతం ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల రూపాయిలు కొల్లగొడుతున్నాయి.
రీసెంట్ గా విడుదలైన ‘సలార్’ చిత్రం అయితే బాలీవుడ్ ట్రేడ్ పండితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేసింది. ఈ సినిమాకి పోటీ గా షారుఖ్ ఖాన్ డుంకీ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని సలార్ సినిమా మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డామినేట్ చేస్తూ వచ్చింది. డొమెస్టిక్ మార్కెట్ లో అయితే డుంకీ చిత్రం సలార్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మామూలు ఊపు లో లేదు. గత ఏడాది ప్రారంభం లో పఠాన్ చిత్రం తో ఒకసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, ద్వితీయార్థం లో ‘జవాన్ ‘ చిత్రం తో మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నాడు.
అలా రెండు సార్లు వెయ్యి కోట్ల మార్కుని అందుకున్న హీరో, రాజ్ కుమార్ హిరానీ లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసినా కూడా మ్యాచ్ చెయ్యలేకపోయాడంటే, ప్రభాస్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమా తర్వాత ఈ ఏడాది ప్రభాస్ నుండి ‘కల్కి’ చిత్రం వస్తుంది. ఇది సలార్ చిత్రం కంటే పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పాలి.
ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం ఆ వసూళ్లను బాలీవుడ్ హీరోలు ఎన్ని కాంబినేషన్స్ సెట్ చేసుకొని వచ్చినా కొట్టలేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇకపోతే సలార్ చిత్రం ఇప్పటి వరకు 560 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో మరో 20 కోట్లు రాబట్టే అవకాశం ఉంది.