కేజీఎఫ్ సినిమాను ఎవరూ మరిచిపోలేదు. యాష్ హీరోగా నటించిన ఈ మూవీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కథ అంతా బంగారు గణుల చుట్టూ తిరుగుతుంది. సాధారణ వ్యక్తి అయిన యష్ బంగారు గనుల్లోకి ఎలా వెళ్తాడు.. తరువాత వాటిపై ఎలా ఆధిపత్యం చెలాయిస్తాడు..? అనే కథాంశంతో సాగుతుంది.
అయితే ఇదంతా సినిమా వరకే.. కానీ ఈ గనులు నిజంగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. అవి కూడా మన దేశంలోనే అంటే ఇంకెంత థ్రిల్ ఉంటుందో కదా.. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘కొలార్ గోల్డ్ మైన్స్’పై సంచలన వార్త ఒకటి రిలీజ్ చేసింది. 20 ఏళ్ల క్రితం మూత పడిన గోల్డ్ మైన్స్ ను తిరిగి తెరిపించాలని చూస్తోంది.
‘కేజీఎఫ్’లో టన్నుల కొద్దీ బంగారం
కేజీఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపిన విషయం మనకు తెలిసిందే. ఈ కథకు మూలం ‘కోలార్ గోల్డ్ మైన్స్’ కర్ణాటకలోని ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్స్’లో దాదాపు 100 సంవత్సరాలకు పైగా బంగారం తవ్వకాలు నిర్వహించారు. బ్రిటీష్ పాలనలో ఉన్న భారత్ అప్పట్లో ఈ మైన్స్ నుంచి టన్నుల కొద్దీ కోల్డ్ ను బయటకు తీసింది. అదంతా తమ దేశానికి తరలించారు బ్రిటీషర్లు. అయితే ఇప్పుడు ఆ మైన్స్ లో మళ్లీ తవ్వకాలు జరపాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్ ప్రాంతంగా
కొలార్ మైన్స్ వద్ద గతంలో చాలా చిత్రాలను షూట్ చేశారు. కానీ అవన్నీ సీన్స్ కోసమే. కానీ ఇటీవల విడుదలైన కేజీఎఫ్ మాత్రం ఈ మైన్స్ బేస్ చేసుకొని కథ ఉండడంతో ఈ మైన్స్ వార్తల్లో నిలిచాయి. దీంతో చాలా కాలంగా నెటిజన్లు కొలార్ గోల్డ్ మైన్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అవి ఎక్కడున్నాయి..? అందులో నుంచి ఎంత బంగారం వెలికి తీశారు..? లాంటివి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు.
దాదాపు 120 సంవత్సరాల చరిత్ర
ఈ ప్రాంతానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్నా ఇక్కడ ఉన్న బంగ్లాలు, పోస్టాఫీస్ లు, స్పోర్ట్స్ కబ్ లు, చక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ 2001లో కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో తవ్వకాలను పూర్తిగా నిలిపివేసింది. తర్వాత ఆ ప్రాంతం షూటింగ్ స్పాట్ గా గుర్తింపు పొందింది. ఇటీవల ‘కేజీఎఫ్’ హిట్ తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది ఈ ప్రాంతం. అయితే కేంద్రం కేజీఎఫ్ పై మరో సారి స్పందించింది.
కేంద్రం తెరుస్తుందా..! చూడాలి మరి..?
కేజీఎఫ్ ప్రపంచంలోనే రెండో లోతైన గోల్డ్ మైన్. 18 వేల అడుగుల లోతు వరకూ సుమారు 121 సంవత్సరాల పాటు మైనింగ్ చేపట్టారు. ఇందులో అనుభవం ఉన్న వారే పని చేసేవారు. కానీ దాదాపు 100 సంవత్సరాలుగా ఇక్కడ మైనింగ్ చేపట్టడం లేదు. దీన్ని టూరిస్ట్ ప్లేస్ చేస్తామని గతంలో వార్తలు కూడా వచ్చాయి. అలా చేస్తే స్థానికంగా ఉన్నవారిని ఉపాధి దొరుకుతుందని భావించారు. కానీ అంతకంటే పెద్ద న్యూసే ఇప్పుడు వైరల్ అవుతుంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మళ్లీ తవ్వకాలు చేపడతామని కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు వార్తలు వ్యాపిస్తున్నాయి. వందేళ్ల క్రితం తవ్వకాలతో బంగారం నిల్వలు అయిపోయాయని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ చాలానే ఉన్నాయని ఇటీవల ఒక సర్వే వెల్లడించడంతో ఇలాంటి ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెరుస్తుందో..? లేదో..? చూడాలి మరి.