రీసెంట్ గా ప్రముఖ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గత సార్వత్రిక ఎన్నికలలో ఈయన వైసీపీ పార్టీ కి రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించాడు. ఆ పార్టీ సంచలన విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ పోషించిన పాత్ర మామూలుది కాదు.
జనాల్లో ఎలాంటి స్కీమ్స్ తో వెళ్ళాలి, మ్యానిఫెస్టో ఎలా ఉండాలి, ఇలాంటి వాటి మీద ఆయన సలహాలను తూచా తప్పకుండ అనుసరించింది వైసీపీ పార్టీ. అందుకే ఆ పార్టీ అంతటి ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన ఐప్యాక్ టీం కి దూరం గా వచ్చేసి బీహార్ లో తనకంటూ ఒక రాజకీయ పార్టీ ని పెట్టుకున్నాడు.
జగన్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల షాక్
చాలా కాలం నుండి రాజకీయ సలహాదారుడి పదవి నుండి దూరంగా ఉంటూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ – జనసేన కూటమి కి రాజకీయ సలహా దారుడి పాత్రని పోషించబోతుండడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద ఎన్నో ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ ఆయన సేవలు దక్కించుకోవాలని చూడడం పై విమర్శలు గుప్పుమంటున్నాయి. కానీ టీడీపీ అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది.
కేవలం మూడు నెలలు రాజకీయ సలహాదారుడి పాత్ర పోషిస్తున్నందుకు ప్రశాంత్ కిషోర్ వంద కోట్ల రూపాయిలు ఛార్జ్ చేస్తున్నాడట.
నిజంగా టీడీపీ – జనసేన కూటమి గెలుస్తుంది. జనాల్లో వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనే విషయం నిజమైతే , ఇంత ఖర్చు చేసి రాజకీయ సలహరుడుని పెట్టుకోవడం ఎందుకు?, అంటే ఈ ఇరు పార్టీలు వైసీపీ ని చూసి ఇంకా భయపడుతోందా అనే సంకేతాలు జనాల్లోకి వెళ్తున్నాయి.
దీనికి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ జనాలకు ఏమని సమాధానం చెప్తారో చూడాలి. ఇదంతా పక్కన పెడితే జగన్ తన ఎమ్యెల్యే అభ్యర్థులను కులాల్ని ఆధారంగా తీసుకొని ముందుకు పోతున్నాడు. దాదాపుగా 50 సిట్టింగ్ ఎమ్యెల్యే లకు ఈసారి టికెట్ దొరకడం కష్టమే.
ఇది తెలుసుకొనే టీడీపీ ప్రశాంత్ కిషోర్ ని రంగం లోకి దింపింది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ముందుకు పోవాలి అనేది ప్రశాంత్ కిషోర్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే అతనికి అంత డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు అనేది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మరి పీకే కూటమి ని విజయం వైపుకు తీసుకెళ్తాడా లేదా అనేది చూడాలి.