సంక్రాంతి సీజన్‌: ‘డాకు మహారాజ్’ ప్రమోషన్స్‌పై విమర్శలు

0

సంక్రాంతి టాలీవుడ్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈ సారి బరిలో నిలుస్తున్న భారీ సినిమాల్లో ‘డాకు మహారాజ్’ కూడా ఒకటి. బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రమోషన్లలో టీమ్ తగినంత శ్రద్ధ పెట్టకపోవడం కొందరు అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

‘డాకు మహారాజ్’ ట్రైలర్ ఆకర్షణీయంగా ఉందని టాక్ ఉన్నపటికీ, సినిమా ప్రచారానికి సరైన వ్యూహాలు లేకపోవడం మూవీకి మైనస్ అయేలా ఉన్నాయి. యూఎస్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించినా, అది పెద్దగా హడావిడి సృష్టించలేకపోయింది. బాలయ్యకు ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యాన్ బేస్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. అదే సమయంలో, మరో పెద్ద చిత్రం ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్లు యూఎస్‌లో విజయవంతంగా సాగడంతో, ఆ సినిమా పట్ల ప్రేక్షకులలో మంచి ఆసక్తి పెరిగింది.

బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొనడం, ఇతర మీడియా చర్చలు వంటి ప్రమోషనల్ చర్యలు చేపట్టినా, అవి సినిమా బజ్‌ను పెంచలేకపోయాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ వంటి పెద్ద బ్యానర్‌ సినిమా తీసినందున, డిజిటల్ ప్రమోషన్లలో మరింత గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటి వరకూ వచ్చిన అప్డేట్స్ ప్రకారం, బాలయ్య కోసం ఈ చిత్రానికి భారీ బడ్జెట్‌ ఖర్చు చేశారు. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మొదటి వీకెండ్‌లోనే భారీ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. సంక్రాంతి పండుగ సీజన్ థియేటర్లకు పెద్ద మొత్తంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను రప్పించే అవకాశం ఉంటుంది. కానీ, సినిమా బజ్‌ను పెంచేందుకు టీమ్ మరింత చొరవ తీసుకుంటేనే ప్రేక్షకులలో ఉత్సాహం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ‘డాకు మహారాజ్’ విజయవంతంగా నిలవాలంటే ఇప్పటికైనా టీమ్ తమ డిజిటల్ వ్యూహాలను మార్చి, పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం చాలా అవసరం. ప్రేక్షకులలో ఆసక్తిని పెంచే విధంగా సోషల్ మీడియాలో రచ్చ చేయడం, మరింత మార్కెటింగ్‌లో దృష్టి పెట్టడం విజయానికి కీలకం అవుతుంది.

మొత్తంగా, ‘డాకు మహారాజ్’ టీమ్ సంక్రాంతి పోటీలో నిలబడే శక్తి చూపించగలిగితేనే బాలయ్యకు మరో బిగ్ హిట్ రాబట్టవచ్చు. ఆరంభం తడబాటుగా ఉన్నప్పటికీ, మంచి వ్యూహాలతో గేమ్‌ను మలుపు తిప్పడం అసాధ్యం కాదని అభిమానులు ఆశిస్తున్నారు.