జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా వచ్చిన సినిమా మూవీ ‘డీజే టిల్లు’. ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ పెద్ద బాక్సాఫీస్ హిట్ అయ్యింది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ గా విమల్ కృష్ణ తెరకెక్కించారు. ‘సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా విడుదలై రూ. 50 కోట్ల గ్రాస్ ను కలెక్షన్ చేసింది. ఈ కలెక్షన్ చిత్రవర్గాలనే విస్మయానికే గురి చేశాయి.
సీక్వెల్ కూడా క్రేజ్ తెచ్చిపెడుతుందా
ఈ మూవీ తెచ్చిన క్రేజ్ తో టీజే టిల్లుకు సీక్వెల్ కూడా ఉండబోతోందని నాగవంశీ అప్పట్లోనే ప్రకటించారు. దీనికి సంబంధించి మూవీలో కూడా లాస్ట్ లో ట్విస్ట్ తో వదిలేశారు. ఆ మేరకు సితారా బ్యానర్ పై ‘టిల్లూ స్క్వేర్’ పేరుతో సీక్వెల్ ను తెరకెక్కించే పనిలో ఉంది చిత్ర యూనిట్. అయితే ఈ సీక్వెల్ చుట్టూ ప్రస్తుతం వివాదాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్టుకు దర్శకుడిగా ఉన్న విమల్ కృష్ణ సీక్వెల్ కు దర్శకత్వం నుంచి తప్పుకున్నాడు. అతని స్థానాన్ని మరో డైరెక్టర్ మల్లిక్ రామ్ ఫిల్ చేశాడు. ఇక హీరోయిన్ గురించి చూసుకుంటే నేహా శెట్టిని మొదటి నుంచే తీసుకోలేదు.
ముగ్గురు హీరోయిన్లు జంప్
ఆమె స్థానంలో అనుపమా పరమేశ్వర్ వచ్చారు. షూటింగ్ మొదలు పెట్టగానే ఆమె కూడా తప్పుకున్నారు. ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటూ ‘ప్రతీ ఎగ్జిట్ మరో ఎంట్రీకే’ అంటూ ట్వీట్ పెట్టి టిల్లూ స్క్వేర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు అనుపమా పరమేశ్వర్ స్థానంలో ‘ప్రేమమ్’ఫేం మడోన్నా సెబాస్టియన్ ని తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా టాలీవుడ్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మడోన్నాకు ఇది మంచి అవకాశమనే అంటూ చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కానీ రీసెంట్ గా ఆమె కూడా తప్పుకున్నట్లు తెలిసింది.
కథలో ప్రాధాన్యత లేదని
తన స్థానంలో ‘హీట్ 2’ హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలీవల ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఒక్కో హీరోయిన్ తప్పుకోవడంలో బలమైన కారణమే ఉందని చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. టిల్లు ఫస్ట్ పార్టులో కథంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. కానీ స్క్వేర్ లో మాత్రం అలా కనిపించడం లేదట.
ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారట
కథ మొత్తం హీరో చుట్టూ తిరుగుతుంది కాబట్టి తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతదని హీరోయిన్లు భావిస్తున్నారని తెలుస్తుంది. డీజే టిల్లు లాగా కథలో పూర్తిగా హీరోయిన్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తే మంచిదని, లేకుండా చిన్న చిన్న స్టార్ హీరోయిన్లను తీసుకొని లాగించేయాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారట హీరోయిన్లు. ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో, టిల్లు ఎవరితో కమిట్ అవుతాడో వేచి చూడాలి మరి.