నీరు శరీరానికి ముఖ్యమైన ఇంధనం.. చాలా అవయవాల పనితీరును నీరే మెరుగు పరుస్తుందనడంలో సందేహమే లేదు. శరీరంలో ఎక్కువ భాగం కూడా నీటితో నిండి ఉంటుంది. కొన్ని రోజుల వరకూ భోజనం లేకుండా ఉండగలమేమో కానీ నీరు లేకుండా మాత్రం ఉండలేం. డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుందని అందరికీ తెలిసిందే.. అయితే దీంతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరక ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ శరీరక క్రియలు సాఫీగా నడిచేందుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో ఇక్కడ తెలుసుకుందాం..
శారీరక క్రియల్లో ప్రముఖ పాత్ర
శారీరక క్రియల్లో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపర్చడంలోనూ మలినాలను మూత్ర పిండాలకు పంపి అక్కడి నుంచి బటయకు నెట్టివేయడంలోనూ ప్రముఖంగా నీరే ముందుంటుంది. శరీరంలో ఇన్ని పనులు చేస్తుంది కదా అని నీటిని ఎక్కువగా తాగద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మోతాదుకు మించి తాగితే ఒకే గానీ అంతకంటే ఎక్కువ తాగితే మాత్రం ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
రోజుకు 8 నుంచి 12 గ్లాసులు చాలు
రోజుకు 8 నుంచి 12 గ్లాసుల నీరు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. 8 గ్లాసులు అంటే దాదాపుగా లీటరుకు సమానం. ఇక వేసవిలో కొంచెం ఎక్కువగానే అవసరం అవుతుంది. అందునా రోజుకు మూడు లీటర్ల కంటే ఎక్కువగా తీసుకుంటే కాలేయ సమస్యలు వస్తాయని చెప్తున్నారు. శరీరంలో రక్త పరిమాణం కూడా పెరిగి గుండెపై ఒత్తిడి ఎక్కువవ్వచ్చు. ఇది కొన్ని సార్లు గుండెపోటుకు కూడా దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పొత్తి కడుపులో నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎక్కువగా తీసుకుంటే సమస్యలే
నీరు ఎక్కువగా తాగితే బాడీలోని పొటాషియం లెవల్స్ లో మార్పు వస్తుంది. కాలేయ సమస్యలు, కడుపు నొప్పికి కూడా పొటాషియం లెవల్ తగ్గడం కారణం కావచ్చు. ఎక్కువగా ఏసీలో పని చేసేవారు రోజుకు 8 గ్లాసుల తీసుకుంటే చాలంటున్నారు. అంటే దాదాపు లీటరు లేదా కొంచెం ఎక్కువగా అన్నమాట. ఎక్కువగా నీరు తీసుకోకుండా ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు తీసుకుంటే చాలంటున్నారు.