తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో హోరాహోరీగా జరిగిన ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి.
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది కానీ, ఇక్కడ కూడా కాస్త శ్రద్ద చూపించి ఉంటే మెజారిటీ సీట్స్ విషయం లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించి ఉండెడదని పలువురి అభిప్రాయం.
ఇదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. రాబొయ్యే ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో కనీసం 10 స్థానాలు అయిన గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి ఎన్ని ఎంపీ స్థానాలు ఉంటే, అంత మంచిది. కేంద్రం లో అధికారం దూరమై పదేళ్లు అయ్యింది. కాబట్టి ఈసారి కచ్చితంగా గెలిచి తీరాల్సిందే అని తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు.
అందుకే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీల నుండి బలమైన నాయకులను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ నుండి రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసాడు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీదనే పోటీకి దిగాడు. చివరికి ఓడిపోయాడు కానీ, చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడ్డాడు.
అలాంటి బలమైన అభ్యర్థికి ఎంపీ సీట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తాడని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. అందులోనూ బీజేపీ పార్టీ లో అధికంగా పోటీ ఉండడం వల్ల ఈటెల కి ఎంపీ సీట్ దక్కడం దాదాపుగా అసాధ్యమే.
ఇదే అదునుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయిస్తే కచ్చితంగా మనకి ఒక ఎంపీ సీట్ కలిసి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తో సహా, మిగిలిన కాంగ్రెస్ నేతల అభిప్రాయం కూడా.
మరి ఈటెల ఒప్పుకొని కాంగ్రెస్ పార్టీ కి వస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంది, ఆ పార్టీ లో కొనసాగితే కచ్చితంగా ఈటెల రాజేందర్ భవిష్యత్తు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్తుంది, మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని పలువురి అభిప్రాయం.