#RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వబోతుంది.
జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ మొత్తం ఎట్టకేలకు ముగిసింది. అయితే సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను నిన్న రీ షూట్ చేసారు.
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో మిగిలిన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో పడింది మూవీ టీం. కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి ‘కుర్చీ మడతపెడితే ‘ అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదలైంది.
ఈ ప్రోమో కి సోషల్ మీడియా నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే మహేష్ – రాజమౌళి సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
నిన్న మొన్నటి వరకు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఫుల్ బిజీ గా గడిపిన రాజమౌళి మరియు అతని తండ్రి విజయేంద్ర ప్రసాద్. మొత్తానికి స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసినట్టు సమాచారం.
ఇక ఇప్పటి నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు వర్క్ షాప్ కి సంబంధించిన ఏర్పాట్లు చెయ్యడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నాడట. మహేష్ బాబు తో పాటు ఈ సినిమాలో పని చేసే ప్రతీ ఒక్కరు ఈ వర్క్ షాప్ లో పాల్గొనబోతున్నారట.
ఫిబ్రవరి నుండి ఈ వర్క్ షాప్ మొదలు అవుతుంది అని, సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఈ సినిమా కథ ఆఫ్రికన్ అడవుల్లో జరుగుతుందని . ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా రాలేదని అంటున్నారు.
కథ రీత్యా ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తీసేంత స్కోప్ ఉంది అట. ఒక్కో భాగాన్ని పూర్తి చెయ్యడానికి ఏడాది సమయం పడుతుందట.
ముందుగా హైదరాబాద్ లో ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్స్ లో మొదటి షెడ్యూల్ జరుగుతుందట, ఆ తర్వాత విదేశాల్లో కొన్ని నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ ని చేయబోతున్నారట.