మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, ఆ తర్వాత తండ్రి లాగ ఎంతో కష్టపడి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. రెండవ సినిమా నుండే రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకోవడం రామ్ చరణ్ కి అలవాటు అయ్యింది. నిర్మాతలకు రామ్ చరణ్ తో ఒక్క సినిమా చెయ్యాలి అనేది కోరిక. ఎందుకంటే సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి అనేది వాళ్ళ నమ్మకం.
అనేక సందర్భాలలో ఈ విషయం గురించి చెప్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. ఇక #RRR చిత్రం తో రామ్ చరణ్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్ళింది. హాలీవుడ్ దర్శకులు కూడా రామ్ చరణ్ తో కలిసి పని చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆయన టాలీవుడ్ లోనే అత్యంత డబ్బులు సంపాదించే హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కేవలం సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగం లో కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ వ్యక్తి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్కో సినిమాకి ప్రస్తుతానికి వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్న రామ్ చరణ్ కి, బ్రాండెడ్ కంపెనీల నుండి యాడ్స్ చేసే అవకాశం కూడా దక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే.
సంక్రాంతి బరిలో చతికిలపడ్డ మన హీరోలు
అలా ఆయన నెల వ్యయం యావరేజ్ గా తీస్తే 7 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది అని, ఇప్పటి వరకు రామ్ చరణ్ కి ఉన్న ఆస్తుల వివరాలన్నీ లెక్క వేస్తే 1370 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వం లో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ కి దాదాపుగా వంద కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని ఇస్తున్నాడు. త్వరలో హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేసే అవకాశం ఉండడం తో రామ్ చరణ్ సంపాదన ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ తో కలిసి ఆయన ఒక నిర్మాణ సంస్థ ని కూడా ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించబోతున్నాడు రామ్ చరణ్.