కృష్ణంరాజు నట వారసత్వాన్ని పంచుకొని టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. మొదటి సినిమా ‘ఈశ్వర్’ ఆయనకు కలిసిరాకున్నా తర్వాత ‘రాఘవేంద్ర’లో నటించి మెప్పించారు. తర్వాత రాజమౌళితో కలిసి ‘ఛత్రపతి’ చేసి ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. విలక్షణ మైన కథలను ఎంచుకుంటూ ఎన్నో రికార్డులు దక్కించుకున్నారు. ఛత్రపతిని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తే మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు.. ప్రభాస్ గతంలోనే పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు అని కొందరు సినీ విశ్లేషకులు కూడా చెప్పారు. ఆయన తర్వాతి చిత్రం ‘బాహుబలి’ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. విదేశాలలో కూడా భారీగా వసూళ్లను రాబట్టింది బాహుబలి.
విపరీతంగా పెరిగిన అంచనాలు
బాహుబలి చిత్రంతో ప్రభాస్ పై ఇండస్ట్రీలో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఆయన తర్వాతి ప్రాజెక్టులు భారీ బడ్జెట్ తో వచ్చినవే. సాహో, రాధేశ్యామ్ భారీ బడ్జెట్ తో వచ్చినా డిజాస్టర్లుగా మిగిలాయి. అయినా ప్రభాస్ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఈ సినిమాల కథ విషయంలో ప్రభాస్ తప్పటడుగు వేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవల ఆయన కొత్త చిత్రం ‘ఆది పురుష్’ టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ భారీగా వ్యూవ్స్ సొంతం చేసుకున్నా అంతే విమర్శలకు గురైంది. చిత్రంలోని పాత్రల తీరు, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బాగాలేదని కామెంట్లు వినిపించాయి. దీంతో చిత్ర యూనిట్ రీ వీఎఫ్ఎక్స్, రీ గ్రాఫిక్స్ కోసం రిలీజ్ డేట్ ను పొడిగించారు. ఈ చిత్రంతో పాటు మరి కొన్ని ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్.
కోపం వచ్చిందా.. అంతేనట
ప్రభాస్ చూసేందుకు చాలా హ్యాండ్ సమ్ గా, కూల్ గా కనిపిస్తారు. ఆరడుగుల ఆజాను బాహుడిగా, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ లో కూడా ఒక బ్యాడ్ క్వాలిటీ ఉందట. కొందరు డైరెక్టర్లు, మరి కొందరు కో స్టార్స్ ప్రభాస్ కోపం గురించి కొన్ని సందర్భాలలో కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని విషయాలలో కూల్ గా ఉండే ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చే వరకు మాత్రం బాగా ఇరిటేట్ అవుతారట. ఎవరైతే ఆ టాపిక్ ను పదే పదే తీస్తారో వారిపై అరిచేస్తారట కూడా. ఎంత పెద్ద వారైనా సరే ఆయన పట్టించుకోరట. సెట్ లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఆయన పెళ్లి గురించి టాపిక్ మాట్లాడరట.
కొంచెం తగ్గించుకున్న రెబల్ స్టార్
ఈ మధ్య తన కోపాన్ని తగ్గించుకున్నారట ప్రభాస్. మొదట్లో ఉన్నంతగా ఇప్పుడు కనిపించడం లేదంటూ కొందరు చెప్పుకస్తున్నారు. ఇప్పుడు కొంచెం కూల్ గానే డీల్ చేస్తున్నారట ప్రభాస్. గతంలో ఆయనకు కోపం వచ్చిందంటే ఎదుటి వారి పని అయిపోయిందనే చెప్పాలి. బాగా అరిచేస్తారట, సెట్ నుంచి వెళ్లిపోయిన సందర్భాలను కూడా కొందరు గుర్తు చేసుకున్నారు. ఇందులో కొందరు తిట్టుకున్న వారు కూడా లేకపోలేదు. మరికొందరు భయపడి దూరంగా వెళ్లిన వారు కూడా ఉన్నారట. ఆయన అభిమానులకు బాగా విలువ ఇస్తారట. ఈ మధ్య వారి సూచనలు కూడా పాటిస్తున్నారు ప్రభాస్. కోపం, ప్రేమ చూపించే విధానం మార్చుకోవాలంటూ కామెంట్లు చేస్తుంటే ఆయన కూడా మారుతున్నారట.