భారీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చారు రాణా. తాత దగ్గుబాటి రామాణాయుడు కాగా, బాబాయ్ కూడా స్టార్ నటుడు విక్టరీ వెంకటేశ్. ఇక ఆయన తండ్రి ఇండస్ట్రీలో మరో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ మంచి సినిమాలు చేస్తున్నారు. దగ్గుబాటి సురేశ్ బాబు-లక్ష్మి దంపతుల పుత్రుడే దగ్గుబాటి రాణా. సినిమాలకు అనుబంధంగా ఉన్న ఫ్యామిలీ కావడంతో ఆయనకు చిన్న నాటి నుంచే నటనపై ఆసక్తి పెరిగింది. సరైన సమయంలో ఆయన తండ్రి సురేశ్ బాబు వెండితెరపై రాణాను పరిచయం చేశారు.
మొదటి చిత్రం లీడర్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లీడర్’తో 2010లో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు రాణా. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ ను బిల్డ్ చేసుకున్నారు. ఆయన హీరోగానే కాకుండా విలన్ గా కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో ఆయన ఎంచుకున్న పాత్రలను చూస్తే ప్రతి ఒక్కటీ భిన్నమనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి కంటిలో పడ్డ రాణాను బాహుబలిలలో భల్లాల దేవునిగా తీసుకువచ్చి రాణాలోని విలనిజాన్ని బయటకు తీశారు. ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.
అన్నీ బ్లాక్ బస్టర్ మూవీసే
బాహుబలి తర్వాత హిందీలో ‘ఘాజీ’ తీశారు. అక్కడ కూడా తన గుర్తింపును నిలబెట్టుకున్నారు రాణా. ఆ తర్వాత తేజ డైరెక్షన్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ విధంగా కెరీర్ లో అన్ని కోణాల్లో దూసుకుపోయారు రాణా దగ్గుబాటి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దీంతో వైద్యులు కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో కొంత కాలం దూరంగా ఉన్నారు కూడా.
ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘భీమ్లా నాయక్’ చేశారు. అక్కడ పవన్ కటన కన్నా రాణానే బాగా చేశారనే టాక్ వచ్చింది. ఈ సినిమాల రాణాకు మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత ‘విరాట పర్వం’లో కనిపించినా నటి సాయి పల్లవికి నిడివి ఎక్కువగా ఉండడం. రాణా గెస్ట్ ఆర్టిస్టుగా మాత్రమే కనిపించారని ఆయన అభిమానులు మండిపడ్డారు కూడా. వారి ఇష్టా అయిష్టాలను తెలుసుకుంటున్న రాణా వారికి నచ్చే సినిమాలు మాత్రమే చేస్తానని హామీ ఇచ్చారు.
సామ్ జామ్ లో రాణా
రాణా తక్కువ సినిమాలే చేసినా అందులో దాదాపు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు దక్కించుకున్నవే. ఈయనకు ‘స్పరిట్ మీడియా’ అనే సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. దీని ద్వారా ఆయన జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గతంలో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘సామ్ జామ్’లో రాణా చెప్పిన మాటలు వింటే కన్నీరు ఆపుకోలేరు. ‘కెరీర్ పీక్ లో వెళ్తున్న సమయంలో తనకు అరోగ్య సమస్యలు మొదలయ్యాయి. వైద్యులను సంప్రదిస్తే వారు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. మొదట్లో చాలా బాధపడ్డా.
కెరీర్ పీక్ లో వెళ్తున్న సమయంలో ఇదేంటి.. అనుకున్నా అది కూడా స్ట్రెస్ కాబట్టి తట్టుకోలేకపోయా.’ అంటూ చెప్పుకచ్చాడు. అయితే దానికి తీసుకున్న చికిత్స విజయవంతం అయ్యిందట. ఇప్పుడు ఇక ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఇక మంచి మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తారని చెప్పారు.