డబ్బు సంపాదన కోసం నిత్యం శ్రమించాలి. కొందరు శారీరక శ్రమను నమ్ముకుంటే మరికొందరు తక్కువ శ్రమతో ఎక్కువ ఆర్జించాలని అనుకుంటారు. అయితే తక్కువ రిస్క్ తో ఎక్కువ ఎలా సంపాదించాలో కొన్నింటిని గురించి ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఫాలో అవ్వండి.
ఆన్ లైన్ కోర్స్ క్రియేటర్
ప్రస్తుత జమానాలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దానికి తగ్గట్లు స్పీడ్ కూడా పెరిగింది. కరోనా కాలం నుంచి ఆన్ లైన్ లో పాఠాలు చెప్పడం మొదలైంది. ఇది క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలని అనుకుంటే ఆన్ లైన్ కోర్సులకు క్రియేటర్ గా మారితే సరిపోతుంది. ఆధునిక యుగంలో ఎక్కువ మంది ఆన్ లైన్ కోర్సులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఒక ప్లాట్ ఫాం ఏర్పరుచుకొని తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక లాభాలు రాబట్టవచ్చు.
బ్లాగింగ్
ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా లాంటివి రాకముందు నుంచే బ్లాగింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఒక బ్లాగ్ ను క్రియేట్ చేసుకొని అధిక లాభాలను పొందవచ్చు. తక్కువ ఖర్చుతో హోస్టింగ్ తీసుకొని మంచి మంచి కథనాలను, కథలను అందులో ఉంచితే వ్యూవర్ షిప్ నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. వీటిని ప్రస్తుతం మార్కెట్లో పోటీ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా నెగ్గుకు రాగలరు. మీరు చేసే పనులను కూడా వీడియో బ్లాగ్ లో పెట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు.
గ్రాఫిక్స్ డిజైనర్ గా
ఆన్ లైన్ లో గ్రాఫిక్ డిజైనర్ గా చేరితే మంచి ఆదాయమే లభిస్తుంది. మంచి కంప్యూటర్ చేతిలో ఉంటే చాలు టూల్స్ ను డౌన్ లోడ్ చేసుకొని గ్రాఫిక్స్ లో అద్భుతమైన డిజైన్ చేసి వినియోగదారులకు అందిస్తూ సంపాదించవచ్చు. దీనికి తగ్గ నైపుణ్యమే ప్రధాన పెట్టబడి ఒక్కో డిజైన్ కు ఒక్కో రేటు ఉంటుంది. ఇందులో కూడా అధికంగా సంపాదించవచ్చు.
కాపీ రైటర్
ఫ్రీలాన్స్ కాపీ రైటర్లు సమయం వృథా కానివ్వరు. ఒక ల్యాప్ టాప్ లాంటిది వెంట ఉంటే చాలు. ఉన్న ప్రాంతం నుంచే ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా క్లయింట్లను ఎన్నుకొని మేనేజ్ చేస్తుంటారు. వారి నుంచి పని తీసుకొని మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రధానంగా వెబ్ పేజీలు, ఈ మెయిల్ మార్కెటంగ్, యాడ్స్ కాపీ వంటివి చేయాలి. ఇందులో కూడా బాగా ఆర్జించవచ్చు.
బిజినెస్ కన్సల్టెంట్
ఒక కంపెనీకి బిజినెస్ కన్సల్టెంట్ గా మారి వారి వ్యాపారంలో ఆర్థికంగా జరిగే తప్పొప్పులను వివరించవచ్చు. వారి కార్యకలాపాలను క్రమపరుస్తూ, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. వీరికి మంచి గిరాకీ ఉంటుంది. పెద్ద పెద్ద గుర్తింపు పొందిన వ్యాపారస్తుల నుంచి చిన్న చిన్న వ్యాపారులకు కూడా వారు తర్వాత ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో, ఎందులో మరింత రాణిస్తారో సూచించాలి. సదరు వ్యాపారుల నుంచి దండిగా సంపాదన ఉంటుంది.
సోషల్ మీడియా మేనేజ్ మెంట్
ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది వ్యాపారులు, రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా తమ వ్యాపారం గురించి, వ్యక్తుల గురించి సోషల్ మీడియాతో పేజీలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటువంటి వారి సూచనల మేరకు పని చేయవచ్చు. ఫేస్ బుక్, ట్విటర్ లాంటి మాధ్యమాల గురించి అవగాహన ఉంటే సోషల్ మీడియా మేనేజ్ మెంట్ చేయడం సులభం. ఇందులో కూడా అధికంగా ఆర్జించవచ్చు.