సినీ సెలబ్రిటీస్ తమ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివిస్తారు అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన టాలీవుడ్ సెలబ్రిటీస్ పిల్లల్ని ఎక్కువగా హైదరాబాద్ ఇంటెర్నేషన్ స్కూల్ లో చదివిస్తుంటారు. ఇక బాలీవుడ్ లో అయితే షారుఖ్ ఖాన్ కొడుకు కూతురు నుండి, ఐశ్వర్య రాయ్ కూతురు వరకు ప్రతీ ఒక్కరు ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’ లో చదివిస్తుంటారు.
ముకేశ్ అంబానీ కోడలు నీతా అంబానీ ఈ స్కూల్ వ్యవస్థాపకురాలు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కొడుకు మరియు కూతురు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. వీరితో పాటుగా షాహిద్ కపూర్ కొడుకు మరియు కరీనా కపూర్ ఇద్దరు కొడుకులు కూడా ఈ పాఠశాల విద్యార్థులే అవ్వడం విశేషం.
జపాన్ లో 430 రోజులు పూర్తి చేసుకున్న RRR
ఈ పాఠశాలలో చదువుకోవాలంటే నెలకి రెండు లక్షల రూపాయలకు పైగానే ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది అట. కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థులకు ఇందులో ప్రావిణ్యం ఉందో, అందులో శిక్షణ ఇచ్చే స్కూల్ అట ఇది.
ముంబై లో కొలువుదీరిన ఈ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యార్థులకు క్రమశిక్షణ విషయం లో చాలా కఠినంగా వ్యవహరిస్తాడట. షారుఖ్ ఖాన్ కొడుకు అయినా, మధ్య తరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి అయినా, ఈ స్కూల్ లో ఉన్నప్పుడు సమానంగానే ట్రీట్ చేస్తారట.
క్రమశిక్షణ తప్పితే ఎంత పెద్ద సూపర్ కొడుకు అయినా, కూతురు అయినా శిక్షని అనుభవించాల్సిందేనట. అలాంటి రూల్స్ ని పెట్టారు. ఇది ఇలా ఉండగా నెల ఫీజులు ఈ రేంజ్ లో తీసుకుంటున్న స్కూల్ యాజమాన్యం, టీచర్స్ కి ఏ రేంజ్ లో జీతాలు ఇస్తున్నారో అని మీ అందరికీ సందేహం రావొచ్చు.
ఏ స్కూల్లో అయినా టీచర్‌గా పనిచేయాలంటే బీ-ఎడ్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఫ్రెషర్స్ కూడా టీచింగ్ చేసే వెసులుబాటు ఇతర స్కూల్స్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం టీచర్ గా ఉద్యోగం సంపాదించాలి అంటే కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
నెల జీతాలు అనుభవం ని బట్టీ రెండు లక్షల రూపాయిల నుండి 7 లక్షల రూపాయిల వరకు ఉంటుంది అట. ఇక్కడ టీచర్ గా పని చెయ్యాలంటే కచ్చితంగా అదృష్టం ఉండాలి. ఎంత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవారు అయినా ఇక్కడ జాబ్ కావాలని కోరుకుంటూ ఉంటారు. అది ఈ స్కూల్ రేంజ్.