యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఇప్పుడు జనాలు ‘సలార్’ టికెట్స్ కోసం కొట్టుకుంటున్నారు. దయచేసి మాకు ఒక్క టికెట్ ఇప్పించండి అంటూ తెలిసిన వాళ్ళను అడుగుతున్నారు.
బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన నిమిషాల వ్యవధి లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి. గంటకి 30 నుండి 40 వేల చొప్పున టిక్కెట్లు అమ్ముడుపోవడాన్ని చూస్తుంటే ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.
ఇతర హీరోల అభిమానులు కూడా ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. బుక్ మై షో యాప్ నిన్న ట్రాఫిక్ తట్టుకోలేక క్రాష్ అయిపోయింది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ మాస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ కేడీఎమ్స్ అన్నీ పంపించేశారు. ప్రతీ థియేటర్ కి ఈ కేడీఎమ్స్ చేరిపోయాయి. ఎల్లుండి 12 గంటల 22 నిమిషాల ఇండియన్ స్టాండర్డ్ టైం కి ఈ కేడీఎమ్స్ అన్లాక్ అవ్వబోతున్నాయి.
ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో అప్పుడే 15 లక్షల డాలర్ల గ్రాస్ ని బుకింగ్స్ ద్వారా ప్రీమియర్ షోస్ కి రాబట్టింది. #RRR చిత్రం తర్వాత మన తెలుగు సినిమాకి రీసెంట్ సమయం లో ఒక్క మిలియన్ డాలర్ మార్కు దాటిన సినిమా కూడా లేదు.
అలాంటిది ‘సలార్’ చిత్రం ఇప్పుడు ప్రీమియర్స్ నుండే రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని రాబట్టబోతుండడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
అన్నీ చోట్ల తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి కానీ, ఇతర భాషల్లో బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఈ చిత్రానికి కీలకంగా మారిన బాలీవుడ్ లో ‘డుంకీ’ చిత్రం కారణంగా కనీస స్థాయి షోస్ ని కూడా ఇవ్వడం లేదట.
ఇక తమిళం, కన్నడం మరియు మలయాళం వెర్షన్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఒక్క రాత్రిలో ప్రారంభమైన ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సలార్ సృష్టించిన విస్ఫోటనం మామూలుది కాదు.