‘ఉప్పెన ‘ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మొదటి సినిమాతోనే ఏకంగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టిన పంజా వైష్ణవ్ తేజ్ ని చూసి మెగా అభిమానులు రాబొయ్యే రోజుల్లో స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఉప్పెన చిత్రమే ఆయన కెరీర్ లో మొదటి హిట్, చివరి హిట్ అవుతుందని మాత్రం ఊహించలేకపోయారు.
ఈ సినిమా తర్వాత ఆయన ‘కొండపొలం’ మరియు ‘రంగ రంగ వైభవంగా’ వంటి సినిమాలను చేసాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎలా అయినా హిట్ కొట్టాలి, కమర్షియల్ మాస్ హీరో అనిపించుకోవాలని ‘ఆది కేశవ’ అనే చిత్రం చేసాడు. గత నెల 24 వ తారీఖున విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్యర్య రాయ్ కి ఎక్కువ ఆస్తులు
రొటీన్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో మితిమీరిన హింసతో పాటుగా, రోత పుట్టించే టేకింగ్ తో డైరెక్టర్ ఆడియన్స్ కి థియేటర్స్ లో టార్చర్ అంటే ఏంటో చూపించాడు. ఫలితంగా ఈ చిత్రం కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.
విషయం లేని సినిమాలో శ్రీలీల తో రెండు అదిరిపోయే డ్యాన్స్ మూవ్మెంట్స్ ఉన్న సాంగ్స్ పెట్టిస్తే చాలు, సినిమా హిట్ అయిపోతుందని డైరెక్టర్ అంచనా వేసాడు. కానీ శ్రీలీల డ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియన్స్ ని అలరించడానికి ఈ నెల 22 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది.
ఒక పక్క ‘సలార్’ చిత్రం థియేటర్స్ లోకి అదే రోజు వస్తుంటే ఓటీటీ లో విడుదలైన ‘ఆది కేశవ’ ని ఎవరు మాత్రం పట్టించుకుంటారు చెప్పండి. ముందు అనుకున్న తేదీ కంటే తొందరగా విడుదల చేస్తే ఎక్కువ డబ్బులు ఇస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కి టెంప్ట్ అయ్యే ఆఫర్ ఇచ్చింది.
నాగ వంశీ లాభపడ్డాడు కానీ, నెట్ ఫ్లిక్స్ కి మాత్రం భారీ నష్టాలను ఈ చిత్రం మిగల్చడం ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.