బాలనటులుగా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత పెద్ద సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు మన ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు.
ఈయన లాగానే తేజ సజ్జల అనే బాలనటుడు ఇప్పుడు హీరో గా మారాడు. ఒకటి రెండు హిట్స్ కూడా కొట్టాడు కానీ, అవేమి చెప్పుకోదగ్గవి కాదు.
కానీ రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘హనుమాన్’ అనే చిత్రం కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.
టీజర్ మరియు ట్రైలర్ ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చే నెల 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం విడుదలయ్యే రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా మీద కూడా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో మామూలు క్రేజ్ లేదు.
ఇలా మార్కెట్ లో రెండు మంచి పాజిటివ్ బజ్ ఉన్న సినిమాలు విడుదల అవ్వడం తో బయ్యర్స్ ‘హనుమాన్’ కి థియేటర్స్ కేటాయించే విషయం లో తల పట్టుకుంటున్నారు.
ఎందుకంటే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రం పక్కన ఉన్నపుడు తేజ సజ్జల లాంటి చిన్న హీరో కి థియేటర్స్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు.
కానీ కంటెంట్ ఉన్న సినిమా కావడం తో థియేటర్స్ సర్దుబాటు చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తేజ సజ్జల బాల్యం లో ఉన్నపుడు మహేష్ బాబు హీరో గా నటించిన రెండవ చిత్రం ‘యువరాజు’ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు.
ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ, తేజ సజ్జల కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలా మహేష్ బాబు సినిమాలో బాలనటుడిగా నటించిన ఈ కుర్రాడు, ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో పోటీ పడే రేంజ్ కి వచేసాడు అంటే, అతను గర్వించదగ్గ విషయమే.
భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న హనుమాన్ హిట్ అయితే మహేష్ ‘గుంటూరు కారం’ చిత్రానికి నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
అందుకే ఈ సినిమాని సంక్రాంతి నుండి తప్పించడానికి చాలా మంది సినీ పెద్దలు ప్రయత్నం చేసారు కానీ, హనుమాన్ మేకర్స్ వెనక్కి వెళ్ళడానికి అసలు సిద్ధపడలేదు.
ఇంత ధైర్యం గా ఉన్నారంటే సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో వచ్చిందో ఊహించుకోవచ్చు.