నందమూరి కుటుంబం లో ప్రతీ ఒక్కటి కొత్త రకంగా తియ్యాలి, జనాలకు కొత్తదనం అందించాలి అని ప్రయత్నం చేసే హీరోలలో ఒకడు కళ్యాణ్ రామ్.
కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అన్నీ అలాంటి సినిమాలను చేస్తూ వచ్చాడు. కొన్ని సక్సెస్ అయ్యాయి కానీ, కొన్ని అవ్వలేదు. కానీ సక్సెస్ అయినా ప్రతీసారి ఇండస్ట్రీ కి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు.
చిన్న వయస్సులోనే నందమూరి ఆర్ట్స్ అనే బ్యానర్ ని స్థాపించి ఎంతో మందికి జీవితాన్ని అందించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం, తానూ ఎప్పటికీ స్టార్ అవ్వాలని కూడా కోరుకోలేదు.
మనసుకి నచ్చింది చేసుకుంటూ పోయాడు. సక్సెస్ వచ్చినప్పుడు ఆస్వాదించాడు. రీసెంట్ గా ఆయన ‘భింబిసారా’ అనే చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన డెవిల్ చిత్రం కూడా నిరాశపరిచింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు కళ్యాణ్ రామ్ చేసిన కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ ఎలా పుట్టింది అనేది చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘నేను ముందుగా బ్యానర్ ని స్థాపించాలి అనుకున్నప్పుడు నా స్నేహితులు నాకు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని తిట్టారు. ఇంట్లో కూడా ఎవ్వరూ ఒప్పుకోలేదు.
కానీ మా నాన్న మాత్రం నీ మనసుకు నచ్చింది చెయ్యిరా అన్నాడు. ఆయన ఇచ్చిన ధైర్యం తోనే నందమూరి ఆర్ట్స్ స్థాపించాను. మొదట్లో ఈ బ్యానర్ కి హరిలక్ష్మి క్రియేషన్స్ అని పెడుదాం అనుకున్నాను.
కానీ నాన్న గారు మనం ఈరోజు ఈ స్థాయిలో ఉంటూ, నాలుగు ముద్దలు తింటున్నాము అంటే, దానికి కారణం తాతయ్య ఎన్టీఆర్ గారే. ఆ మహానుభావుడి పేరు పెట్టు అని చెప్పాడు.
ఆయన చెప్పినట్టుగానే పెట్టాను. ఈ బ్యానర్ మీదనే మొదట అతనొక్కడే సినిమా తీసాను, పెద్ద హిట్ అయ్యింది. మధ్యలో ఫ్లాప్స్ కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ బ్యానర్ ని నడుపుతున్నాను.
ఇప్పుడు దేవర అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తీసే రేంజ్ కి ఆ బ్యానర్ ఎదిగింది, అందుకు ఎంతో గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ రామ్.