మెగాస్టార్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ను అలరిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’లో ‘బాస్ పార్టీ’ సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్. బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ నుంచి ‘జై బాలయ్య’ పాటను విడుదల చేయనుంది. ‘రాజసం నీ ఇంటిపేరు’ అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇందులో బాలయ్య వింటేజ్ లుక్స్ తో అదరగొడుతున్నాడు.
అభిమానుల ఆనందం
నటసింహ నందమూరి బాలకృష్ణకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. వారికి ఉత్సాహం కలిగించేలా ‘మైత్రీ మూవీ మేకర్’ ఒక పాటను విడుదల చేసింది. ఈ చిత్రం నుంచి ఇది తొలిపాట కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘జై బాలయ్య’ పాటను చిత్ర యూనిట్ శుక్రవారం (నవంబర్ 25)న విడుదల చేయనుంది. గోపీచంద్ మలినేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీన్ని సంక్రాంతికి తీసుకురావాలని యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్
దీనిపై యూనిట్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. ఈ సాగ్ ఉదయం 10.29 గంటలకు సోషల్ మీడియా వేదికగా విడుదల కానుంది. ‘రాజసం నీ ఇంటి పేరు’ అంటూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో బాలకృష్ణ తెలుపు రంగు దుస్తులు ధరించి, ట్రాక్టర్ నడుపుతూ వింటేజ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా నెట్టింట్లో అభిమానుల సందడి నెకొంది. ఎప్పుడు తమ బాలయ్య బాబు సాంగ్ వస్తుందోనంటూ ప్రశ్నల వర్షం కురిపించడం కొసమెరుపు.
తమన్ మ్యూజిక్ డైరెక్టర్
‘వీరసింహా రెడ్డి’ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వీరి కాంబోలో గతంలో ‘అఖండ’ వచ్చింది. ఇందులో ‘యా యా యా యా జై బాలయ్య’ పాట ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే ఇదే తరహాలో ‘రాజసం నీ ఇంటిపేరు’ కూడా అంతటి క్రేజ్ సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాంగ్ మామూలుగా లేదని, మరో సంచలనం సృష్టిస్తుందని నెటిజన్లు, ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వీరసింహా రెడ్డి క్రూ
వీరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్ చేయనున్నారు. రిషీ పంజాబీ సినిమటో గ్రాఫర్ గా, డైలాగ్స్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా (గౌతమీ పుత్ర శాతకర్ణి) బాధ్యతలు నిర్వహించారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు. ఇంత పెద్ద స్టార్స్ కలయికతో వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ను తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, రవి శంకర్ ‘వీరసంహా రెడ్డి’ని కూడా తీస్తున్నారు. ఈ రెండు మూవీస్ ను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.