నందమూరి ఫ్యామిలీ నుండి ప్రయోగాలకు ఎప్పుడు సిద్ధంగా ఉండే హీరోలలో ఒకడు నందమూరి కళ్యాణ్ రామ్. తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతి ఇవ్వాలని తాపత్రయం పడుతూ ఉంటాడు.
అయితే పాపం దురదృష్టం కొద్దీ ఆ ప్రయోగాలు ఫ్లాప్స్ అవ్వడం తో కళ్యాణ్ స్టార్ కాలేకపోయాడు. కానీ మధ్యలో ఆయన చేసిన కమర్షియల్ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.
గత ఏడాది ‘బింభిసార’ అనే సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న కళ్యాణ్ రామ్, ఈ ఏడాది ‘డెవిల్’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు.
బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమాకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది.
మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ఇది కూడా పర్వాలేదు అనే రేంజ్ అన్నమాట.
కథ విషయానికి వస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఒక సీక్రెట్ కోడ్ బయటకి వచ్చిందని, దానిని చెందించే మిషన్ కోసం తమ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ ని రంగం లోకి దింపుతారు.
ఈ మిషన్ ని ఛేదించే క్రమం లో ఒక రాజకుటుంబం కి సంబంధించిన మర్డర్ కేసు ని కూడా పరిష్కరించే బాధ్యత డెవిల్ కి వస్తుంది. ఈ మర్డర్ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయం లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మిషన్ కి, ఈ మర్డర్ కేసు కి మధ్య సంబంధం ఉందని తెలుస్తుంది.
ఆ సంబంధం ఏమిటి?, డెవిల్ ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేదే ఈ సినిమా స్టోరీ. కథాంశం చాలా కొత్తగా ఉంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఎంతో స్కోప్ ఉన్న సబ్జెక్టు అయినా కూడా, ఎందుకో డైరెక్టర్ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేసే స్క్రీన్ ప్లే మాత్రం రాసుకోలేకపోయాడు.
ట్విస్టులను చాలా తేలికగా ప్రేక్షకుడు కనిపెట్టేయగలడు. అలా ఉంటుంది స్క్రీన్ ప్లే. కథ కి తగ్గట్టుగా కాస్త థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఉండేది.
కానీ ఇప్పటికీ ఈ చిత్రం బాగానే ఉంటుంది, ఒకసారి ఈజీ గా చూసేయొచ్చు, కానీ భారీ అంచనాలు మాత్రం పెట్టుకోకండి.