బుల్లితెర కామెడి షో గురించి తెలిసిన వారికి ఆర్పీ గురించి పరిచయం అక్కర్లేదు. డిఫరెంట్ యాసలో మాట్లాడుతూ అర్థం కాని పంచులతో నవ్విస్తూనే ఉంటాడు. అయితే ఆయన మొదట్లో బుల్లితెరవైపు వచ్చినప్పుడు స్ర్కిప్ట్ రైటర్ గా వచ్చాడు. తర్వాత దర్శకత్వం వైపు వెళ్లాలనుకున్నాడు, కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేక జబర్ధస్త్ ను ఆశ్రయించాడు. మొదట్లో స్కిట్ కు సంబంధించి స్క్రిప్ట్ ఇచ్చేవాడు.
తర్వాత తర్వాత మెల్లగా కో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ‘కిరాక్ ఆర్పీ’ అని టీం ఏర్పాటు చేసి దానికి టీం లీడర్ గా అవతారం ఎత్తాడు. అన్ని రంగాల్లో రాణించాడనే చెప్పాలి. ఇన్ని రంగాల్లో రాణిస్తూ మంచిగానే సంపాదించడం మొదలు పెట్టాడు. బాగానే కూడబెట్టాడు కూడా..
ఆర్థికంగా నిలదొక్కుకున్న ఆర్పీ
కిరాక్ ఆర్పీ ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నాడనే చెప్పాలి. జబర్ధస్త్ షో ఆయనకు బాగా కలిసి వచ్చింది. ఇటీవల సొంత ఇల్లు కూడా కట్టుకున్న ఆయన ప్రేమ వివాహం చేసుకొని సెటిల్ అయ్యడు. అయితే ఆయన భార్య కూడా ఈవెంట్లు కంటెస్ట్ చేస్తుంటుందట. ప్రస్తుతానికి వీరి జీవితం ఆనందంగానే కొనసాగుతుంది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జబర్ధస్త్ ను వీడిన ఆర్పీ స్టార్ మాలోని కామెడీ స్టార్ కు వెళ్లారు. అక్కడ కూడా టీం లీడర్ కొనసాగారు. ఇటీవల ఆయన జబర్ధస్త్ షోపై దారుణమైన విమర్శలు చేశారు.
ఈ విమర్శలను ఆది, రాంప్రసాద్, శేషు ఆర్పీ వ్యాఖ్యలను తీవ్రంగానే ఖండించారు. ఎప్పుడూ బయట కనిపించని ప్రోగ్రాం మేనేజర్ ఏడుకొండలు సైతం ఆర్పీ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్యాం ప్రసాద్ వంటి వారిపై ఆర్పీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఆ స్థాయి కూడా ఆర్పీకి లేదన్నారు ఏడు కొండలు.
బిజినెస్ పై ఫోకస్ పెట్టిన ఆర్పీ
ఇవన్నీ పక్కన పెడితే ఆర్పీ ఈ మధ్య బిజినెస్ పై బాగా ఫోసన్ చేస్తున్నాడట. సొంతంగా వ్యాపారం చేసి రాణించాలని చూస్తున్నారట. ఏ రంగంలో రాణించవచ్చు అని ఆలోచించి ఫుడ్ ను ఎంచుకున్నారట. సొంతంగా ఒక కిచెన్ ఏర్పాటు చేసుకొని బిజినెస్ ప్రారంభించాడు ఆర్పీ. నెల్లూరు చేపల పులుసుకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే ఇదే రుచిని హైదరాబాద్ నగర వాసులు అందించాలని అనుకున్నారట. ఇందులో భాగంగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో కిచెన్ హైదరాబాద్ లో స్థాపించిన ఆర్పీ చేపల పులుసు బిజినెస్ లో బాగానే రాణిస్తున్నారని చెప్పాలి.
మరిన్ని బ్రాంచులకు ప్రణాళికలు
ఆర్పీ ఏర్పాటు చేసిన కిచెన్ లోని చేపల పులుసును హైదరాబాద్ లోని ఒక ఫేమస్ కర్రీ పాటింట్ లో అమ్ముతున్నారట. తన స్నేహితునితో కలిసి రూ. 50 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించినట్లు ఆర్పీ చెప్పాడు. ఇంకా హైదరాబాద్ లో 15 కు పైగా బ్రాంచ్ లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు చేపల పులుసును హైదరాబాద్ వాసులకు అందాలనే ఈ బిజినెస్ ను ప్రారంభించిన ఆర్పీ, ఆయన స్నేహితుడు బాగానే సంపాదిస్తున్నారట.