మహానటిగా కీర్తి గడించిన సావిత్రీ కథ విషాదాంతంగా ముగిసిందని మనందరికీ తెలిసిందే. ఆమె జీవించి ఉన్నంత కాలం ఎంత కీర్తి గడించిందో అంతే సమానంగా అవమానాలను కూడా ఎదుర్కొంది. ఆమె బతికి ఉన్నన్ని రోజులు ఎంతో మందికి దాణ ధర్మాలు చేసింది. ఎంతో మంది కార్మికుల కోసం ఫ్యాక్టరీలను కూడా స్థాపించింది. తెలుగు తెరకు దొరికిన మకుటం లేని మహారాణి సావిత్రీ. కానీ చివరి రోజులు మాత్రం అనాథగా మరణించడం బాధాకరం. ఆమె ఇన్ని కష్టాలు ఎదుర్కొనేందుకు అసలు కారణం మరో నటి అంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఏలూరులో పుట్టి పెరిగింది రాజశ్రీ
తమిళ ఇండస్ర్టీ నుంచి వచ్చిన ఒక నటి తెలుగు వారికి కూడా సుపరిచితురాలే. అసలు ఆమెకు సామిత్రీకి సబంధం ఏమిటో చూద్దాం. ఏలూరులో పుట్టి పెరిగింది రాజశ్రీ. మొదట బాలనటిగా తమిళ్ ఇండస్ర్టీలో అడుగుపెట్టి మంచి కీర్తి గడించింది. మెల్ల మెల్లగా హీరోయిన్ గా కూడా రాణించడం మొదలుపెట్టింది. తర్వాత టాలీవుడ్ ఇండస్ర్టీలో అడుగుపెట్టి అప్పటి అగ్రహీరోలందరితో పని చేసింది. ఆమెపైన కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆమె లైఫ్ హిస్టరీ గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఈమంది రామారావు కొన్ని విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
గాసిప్ లను నమ్మవద్దు
‘సీనియర్ నటి రాజశ్రీకి రెండు ఇండస్ర్టీలో బాగా గుర్తింపు వచ్చింది. దీంతో ఆమె బాగానే సంపాదించే వారు. ఆమె అప్పటి ఎమ్మెల్సీ పాంచజన్యంను వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం జరిగిన ఐదు సంవత్సరాలకే పాంచజన్యం మృతి చెందాడు. ఇక చేసేదేం లేక ఆమె మళ్లీ మద్రాస్ కు వచ్చి సినిమాల్లో బిజీగా మారారు. ఈ నేపథ్యంలో సావిత్రీ ఆస్తులను రాజశ్రీ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇందుకు సావిత్రీ, జెమినీ గణేశన్ మధ్య గొడవలు పెట్టింది కూడా ఆమే అంటూ వార్తలు ప్రచారం బాగా సాగింది.
సావిత్రీ, జెమిని గణేశన్ తో పాటు రాజశ్రీ కూడా నటి మాత్రమే. వారికి నటనా పరమైన సాన్నిహిత్యం తప్ప మరోటి లేదు. అప్పటికీ రాజశ్రీ కూడా దాదాపు సావిత్రీ అంత సంపాదించారు. ఒక ఇంకొకరి ఆస్తి ఆమెకు ఎందుకు? అప్పటి రూమర్లలో ఎలాంటి నిజం లేదు.’
వారివి కుటుంబ పరమైన మనస్పర్థలే
‘మహానటి సావిత్రీకి, ఆమె భర్త జెమినీ గణేశన్ కు కుటుంబ పరమైన మనస్పర్థలు తప్పితే. బయటి వారు సృష్టించినవి కావు. జెమినీ గణేశన్ గురించి అన్నీ తెలుసుకొని వివాహం చేసుకున్న సావిత్రీ తర్వాత కొంత కాలానికి ఆయనను ధ్వేషిస్తూ వచ్చింది. ఒక సందర్భంలో ఆయన సావిత్రీని చూసేందుకు రాగా ఆయనపై కుక్కలను వదిలింది. అసలు రాజశ్రీ ఒక కోయాక్టర్ మాత్రమే. సావిత్రీ కుటుంబాని ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.’ అంటూ ఈమంది వివరించారు. ఏది ఏమైనా సావిత్రీ కథ మాత్రం చాలా విషాదంగా ముగిసింది. చివరి రోజుల్లో ఆమె ఆర్థికంగా నరకం అనుభవించిందనే చెప్పాలి.